BigTV English
Advertisement

Vijay Devarakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ!

Vijay Devarakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ!

Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండకు(Vijay Devarakonda) తిరుపతిలో (Tirupati)ఊహించని షాక్ తగిలింది. తిరుపతిలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డం (King Dom)సినిమా ట్రైలర్ లాంచ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తిరుపతి చేరుకున్నారు. అయితే గిరిజన సంఘాలు (Tribel Community) మాత్రం విజయ్ దేవరకొండ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. గతంలో విజయ్ దేవరకొండ గిరిజనులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అని తెలుస్తుంది. గిరిజన సంఘాల జేఏసీ నాయకుల సమక్షంలో పలువురు ప్లకార్డులు పట్టుకొని విజయ్ దేవరకొండ గో బ్యాక్ అంటూ నెహ్రూ మున్సిపల్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు.


గో బ్యాక్ విజయ్ దేవరకొండ..

ఇలా గిరిజనలు ఆందోళనలకు దిగడంతో ఈ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. హీరో సూర్య నటించిన రెట్రో(Retro) సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన నేపథ్యంలో ఈ ఘటన గురించి విజయ్ దేవరకొండ వేదికపై మాట్లాడారు. అయితే ఐదు వందల సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్టు ఇప్పుడు కొట్టుకోవడం ఏంటి అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యల పట్ల గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.


ఉగ్రవాదులతో పోలిక ఏంటీ?

విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదంటూ గతంలో ఈయనపై కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలియజేశారు. ఇలా పలు సందర్భాలలో విజయ్ దేవరకొండ స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ గిరిజనలు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఎలా జరుగుతుందో మేము కూడా చూస్తాము అంటూ గిరిజనలు నిరసనలు చేపట్టడం అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇలా గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టడంతో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇకపోతే విజయ్ దేవరకొండ తరచూ ఇలాంటి వివాదాలలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమా ఏదైనా విడుదలవుతున్న లేదా విజయ్ దేవరకొండ ఏ కార్యక్రమంలో మాట్లాడినా పెద్ద ఎత్తున ఆ వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తూ ఉంటారు. ఇలా సినిమా విడుదలకు ముందు మరోసారి గిరిజనులు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఈ సినిమాపై ప్రభావం చూపుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొంతకాలంగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి గిరిజన వివాదం రావడంతో చిత్ర బృందానికి కూడా ఇది తలనొప్పిగా మారిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో పాటు ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచడంతో విజయ్ దేవరకొండకు మంచి హిట్ పడుతుందని ఆశిస్తున్నారు.

Also Read: Coolie Sequel: కూలీ సీక్వెల్ ఉండబోతుందా.. రజనీకాంత్ అలా చెప్పారా?

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×