Green Chilli Benefits: పచ్చి మిర్చిని ఎక్కువగా వంటల్లో విరివిగా వినియోగిస్తారు. కూరల్లోనే కాకుండా బజ్జీ, సమోసా, ఇతర స్నాక్స్‌లో కూడా ఉపయోగిస్తారు. అయితే పచ్చి మిర్చిని తింటే మంటగా ఉంటుంది, కడుపు నొప్పి వస్తుందని ఎక్కువగా తినరు కొందరు. కానీ పచ్చి మిర్చిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలు వైద్యులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అనేక ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.
పచ్చిమిర్చి పోషకాలు:
పచ్చి మిర్చిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బరువుకు చెక్:
పచ్చి మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచి, కేలరీలు బర్న్ చేయడంలో మరియు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి:
దీనిలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరడటానికి సహాయపడుతుందని పలు నిపుణులు తెలిపారు. పచ్చి మిర్చిలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. మలద్ధకం వంటి ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది.
గుండె ఆరోగ్యం:
పచ్చిమిర్చిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే డయాబెటస్ సమస్యతో బాధపడేవారు పచ్చిమిర్చి తినడం వల్ల ఈ సమస్యను నియంత్రిస్తుందని పలు వైద్యలు సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది:
ఇందులో ఉండే విటమిన్ ఇ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ సమస్యలను తగ్గించవచ్చని చెబుతున్నరు. అలాగే ముఖ్యంగా దీనిలో ఉండే క్యాప్సైసిన్, క్యాన్సర్ కారకాలతో పోరడటానికి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నొప్పులు మాయం:
చాలా మంది నొప్పులతో బాధపడేవారు పెయిన్ రిలీఫ్, క్రీమ్స్ వాడతారు. అందులో చాలా వరకూ పచ్చి మిర్చీ సారం ఉంటుంది. ఎందుకంటే, ఇందులో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి, ఎలాంటి నొప్పినైనా తగ్గించే గుణం ఇందులో ఉన్నాయి. అందుకే వీటిని కీళ్లనొప్పులకు దివ్యౌషధం అని చెబుతున్నారు.
Also Read: అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా.. అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే
అయితే రోజువారి ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలను పోందవచ్చు. పచ్చి మిరపకాయలు తింటే మంట పుడుతుందని బయపడకుండా నిర్భయంగా తినవచ్చని పలు వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని భోజనంతోపాటు ఆహారంలో తీసుకోవడం వల్ల మానసిక సంతోషాన్ని ఇస్తుందని, ఆందోళనను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.