BigTV English

Maargan Movie Review : ‘మార్గన్’ రివ్యూ : విజయ్ ఖాతాలో మరో మూవీ బలైపోయింది

Maargan Movie Review : ‘మార్గన్’ రివ్యూ : విజయ్ ఖాతాలో మరో మూవీ బలైపోయింది

Maargan Movie Review : ‘బిచ్చగాడు’ తో తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులపై దండయాత్ర చేస్తున్నాడు కానీ.. ఏ సినిమాతోనూ ‘బిచ్చగాడు’ స్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ‘మార్గన్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అయినా హిట్ అందుకున్నాడేమో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
రమ్య అనే అమ్మాయిని దారుణంగా హతమార్చి ఓ చెత్తకుప్పలో పడేస్తారు కొంతమంది ఉన్మాదులు. ఆమెను చంపిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో రమ్య శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమె చనిపోతుంది. ఆమెని చంపిన వాళ్ళు కూడా నల్లకారులో తీసుకెళ్లి చంపుతారు.ఈ మర్డర్ కేసు గురించి తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతాడు పోలీస్ ఆఫీసర్‌ ధృవ్ (విజయ్ ఆంటోనీ). ఈ క్రమంలో అరవింద్ (అజయ్ ధీషన్)ను ఓ సస్పెక్ట్ గా గుర్తిస్తాడు.

అతనే రమ్యని మర్డర్ చేశాడా? లేక ఇంకెవరి హస్తమైనా ఉందా.? మధ్యలో శ్రుతి (బ్రిగిడా) పాత్ర ఏంటి? ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది ఎవరు? వారు ఏమి ఆశించి వీళ్ళని చంపుతున్నారు? అసలు ధృవ్ శరీరం నల్లగా ఎందుకు మారింది? అతను ఎందుకు ఈ సీరియల్ కిల్లింగ్స్ కేసుని దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగాడు. అతని గతం ఏంటి? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :
విజయ్ ఆంటోనీ సినిమాల్లో పాయింట్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా టేకాఫ్ కూడా చాలా ఎక్సైట్ చేస్తుంటుంది. అయితే తర్వాత కథనం ఫ్లాట్ గా లేదా వీక్ గా మారిపోతూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఎందుకో సంతృప్తి నివ్వదు. ‘మార్గన్’ విషయంలో కూడా అదే జరిగింది.దర్శకుడు లియో జాన్ పాల్ ఎంపిక చేసుకున్న పాయింట్ వైవిధ్యంగా ఉంది. కథకుడిగా అతను మంచి ప్రయత్నమే చేశాడు. కానీ డైరెక్షన్ విషయంలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకోవడంలో, అలాగే దానిని తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు అని చెప్పాలి. థ్రిల్లర్ సినిమాలకి స్క్రీన్ ప్లే వీక్ గా ఉంటే వర్కౌట్ అవ్వదు.

సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా సరైన లాజిక్స్ తో ఉండాలి. అలా తన జాబ్ కి లియో న్యాయం చేయలేకపోయాడు. మొదటి 20 నిమిషాలు అయ్యాక సినిమా మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. ఇంటర్వెల్ కి కొన్ని మెరుపులు మెరిపించినా.. సెకండాఫ్ లో వాటిని కంటిన్యూ చేయలేకపోయాడు. మధ్యలో మళ్ళీ పికప్ అవుతుందనే హోప్స్ ఇచ్చినా.. ఆ అభిప్రాయం తప్పు అని ప్రూవ్ అవ్వడానికి పెద్దగా టైం తీసుకోలేదు. చివరికి ఓ సాదా సీదా క్రైమ్ మూవీగా మిగిలిపోతుంది. కానీ థ్రిల్లర్ అనిపించుకోదు.

టెక్నికల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ బాగుంది. అతనే నిర్మాత కాబట్టి.. బడ్జెట్ కంట్రోల్ చేయడానికి అతను పడ్డ తపన కూడా ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. సినిమాకి తక్కువ నిడివి ఉన్నా.. ప్రేక్షకులకి బోర్ కొట్టింది అంటే.. స్క్రీన్ ప్లే ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే… విజయ్ ఆంటోనీ ఎప్పట్లానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేశాడు. లుక్ విషయంలో సగం బ్లాక్ గా కనిపించడం కొత్తగా అనిపిస్తుంది. అజయ్ దిషాన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా.. అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గ పాత్ర ఈ సినిమాలో దక్కలేదు. లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. మహానది శంకర్ రోల్ సీరియస్ గా సాగుతున్న సినిమాలో కూడా నవ్వించేలా ఉంది. అది కొంత రిలీఫ్ అనుకోవాలి. బ్రిగిడ సాగా పాత్ర పర్వాలేదు. శేశ్విత రాజు ఓకే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

మొదటి 20 నిమిషాలు
ఇంటర్వెల్ బ్లాక్
టెక్నికల్ టీం పనితీరు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండటం
డైరెక్షన్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం
క్లైమాక్స్

మొత్తంగా.. ఈ ‘మార్గన్’ ఇంట్రెస్టింగ్ గా మొదలైనా తర్వాత వీక్ స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టిస్తుంది. ఓటీటీలకి ఇలాంటి సినిమాలు ఓకే. కానీ థియేటర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమా కాదు.

Maargan Movie Rating: 1.5/5

Related News

Kantara Chapter 1 Movie Review : కాంతార చాప్టర్ 1 రివ్యూ

KantaraChapter 1 Twitter review : కాంతారా చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

Idli Kottu Movie Review : ఇడ్లీ కొట్టు రివ్యూ.. మూవీలో చట్నీ తగ్గింది

OG Movie Review : ‘ఓజి’ మూవీ రివ్యూ – ఫుల్ మీల్స్ కాదు.. ప్లేట్ మీల్సే

Beauty Movie Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ… బ్యూటీ కాదు స్కూటీ

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

KishkindhaPuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ : భయపెట్టింది.. అయినా ఫోన్ చూడాల్సి వచ్చింది

Mirai Movie Review : మిరాయ్ రివ్యూ – సూపర్ హీరో సూపర్ ఉందా ?

Big Stories

×