OTT Movie : ఇంటెన్స్ కథలతో, థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామాలతో సైకో కిల్లర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటాయి. డానిష్ డైరెక్టర్ లార్స్ వాన్ ట్రియర్ రూపొందించిన అలాంటి ఒక సైకలాజికల్ హారర్ఎం క్రైమ్ థ్రిల్లర్, సీరియల్ కిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సినిమా అత్యంత వివాదాస్పదమైంది. ఇందులో ఉన్న గ్రాఫిక్ వయోలెన్స్, ఫిలాసఫికల్ థీమ్స్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉన్న ప్రముఖులను షాక్ కు గురి చేసాయి. ఒక డీప్, డిస్టర్బింగ్, ఆలోచింపజేసే సినిమా కావాలంటే ఈ చిత్రం మీ కోసమే. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ కాంట్రవర్షియల్ మూవీ పేరు ‘The House That Jack Built’. లార్స్ వాన్ ట్రియర్ దర్శకత్వంలో, జెంట్రోపా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2018లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హులు, MUBIలో అందుబాటులో ఉంది. ఇందులో మాట్ డిల్లాన్ (జాక్), బ్రూనో గాంజ్ (వర్జ్), ఉమా థుర్మాన్ (ఫస్ట్ ఇన్సిడెంట్ లేడీ), సియోభాన్ ఫాలన్ హోగన్ (సెకండ్ ఇన్సిడెంట్ లేడీ), సోఫీ గ్రాబోల్, రిలే కీఫ్ (సింపుల్), జెరెమీ డేవిస్ నటించారు. ఈ మూవీ 2018లో కాహియర్స్ డు సినిమా ద్వారా 8వ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
కథలోకి వెళ్తే…
జాక్ (మాట్ డిల్లాన్) ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్, ఫెయిల్యూర్ ఆర్కిటెక్ట్. తన 12 సంవత్సరాల హత్యల జీవితాన్ని ఐదు “ఇన్సిడెంట్స్” ద్వారా వివరిస్తూ, వర్జ్ (బ్రూనో గాంజ్) అనే సీక్రెట్ మనిషితో మాట్లాడతాడు. ఈ కథ 1970-80 దశకంలో వాషింగ్టన్ స్టేట్‌లో జరుగుతుంది, జాక్ తన హత్యలను “కళాత్మక రచనలు”గా భావిస్తాడు.
ఫస్ట్ ఇన్సిడెంట్
జాక్ ఒక మహిళను రోడ్డు పక్కన కారు టైర్ బిగించడానికి జాక్ (టైర్ లిఫ్ట్) కోసం సహాయం అడుగుతాడు. ఆమె అతనిని సీరియల్ కిల్లర్ అని ఎగతాళి చేస్తూ, అతను ధైర్యం లేని వ్యక్తి అని రెచ్చగొడుతుంది. ఆగ్రహంతో జాక్ ఆమెను టైర్ జాక్‌తో కొట్టి చంపి, ఆమె శరీరాన్ని తన ఫ్రీజర్‌లో దాచిపెడతాడు. ఈ హత్య అతని మొదటి అడుగు.
సెకండ్ ఇన్సిడెంట్
జాక్ ఒక వృద్ధ మహిళ దగ్గర ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా నటించి మోసం చేసి, ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతని OCD (అబ్సెసివ్-కంపల్సివ్ డిసార్డర్) కారణంగా, రక్తపు మరకలు ఊహించుకుని ఆమె ఇంటికి తిరిగి వెళ్తాడు. దీనివల్ల పోలీసులు సమీపిస్తారు. అయినప్పటికీ వర్షం రక్తపు జాడలను కడిగేస్తుంది, జాక్ తప్పించుకుంటాడు.
తర్వాతి ఇన్సిడెంట్స్
జాక్ హత్యలు మరింత క్రూరంగా మారతాయి. ఒక సీన్‌లో అతను ఒక మహిళను హింసిస్తాడు. ఆమె పిల్లలను చంపి, ఒక డిస్టర్బింగ్ “పిక్నిక్” సీన్‌ను సృష్టిస్తాడు. మరొక ఇన్సిడెంట్‌లో అతను హంటింగ్ గేమ్‌లా మహిళలను వేటాడతాడు. ఇది సినిమాలో అత్యంత వివాదాస్పద సీన్‌లలో ఒకటి. జాక్ తన బాడీస్‌ను ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తూ, తన “డ్రీమ్ హౌస్”ను బిల్డ్ చేయాలనే ఆలోచనతో ఉంటాడు. మరి అతని డ్రీం నెరవేరిందా ? ఎందుకిలా అందరినీ చంపుతున్నాడు? పోలీసులు ఇంథాని పట్టుకున్నారా? అనేది స్టోరీ.