Kangana ranaut: బాలీవుడ్ క్వీన్, హిమాచల్ ప్రదేశ్.. మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్టైల్ అండ్ ఫ్యాషన్ ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. రీసెంట్‌గా పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఆమె వేసుకున్న రాయల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ధరించిన చీర నుంచి పెట్టుకున్న వాచ్, హ్యాండ్‌బ్యాగ్, చివరకు కాళ్ల చెప్పుల వరకు ప్రతీ ఐటమ్ ఖరీదు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ ఒక్క సింగిల్ లుక్ విలువ దాదాపు కోటి రూపాయలకు పైనే ఉంటుందని అభిమానులు అంచనా వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు..ఆ విశేషాలు చూద్దాం..
ఆమె ధరించిన ఈ సాంప్రదాయ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చీర సాధారణమైనది కాదు. ఇది అత్యంత విలువైన ‘పాటన్ పటోలా’ హ్యాండ్‌లూమ్ చీర. చేతితో నేసిన ఈ రాయల్ పటోలా చీర అంచనా ధర దాదాపు రూ. 4,00,000 వరకు ఉంటుందని టాక్.
ఈ పార్లమెంట్ లుక్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది కంగానా చేతికి ఉన్న లగ్జరీ రోలెక్స్ వాచ్. ఈ హై-ఎండ్ లగ్జరీ మోడల్ వాచ్ విలువ అక్షరాలా దాదాపు రూ. 76,00,000 దాకా ఉంటుందని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు.
చేతిలో పట్టుకున్న క్లాసీ బ్లాక్ కలర్ హెర్మేస్ బిర్కిన్ లగ్జరీ లెదర్ బ్యాగ్ ధర సుమారు రూ. 20,00,000. చెవులకు పెట్టుకున్న డైమండ్ ఇయర్ రింగ్స్ విలువ దాదాపు రూ. 10,00,000 వరకు ఉంటుందని అంచనా.
కళ్లకు పెట్టుకున్న డియోర్ కళ్లజోడు ధర దాదాపు రూ. 45,000 కాగా, కాళ్లకు ధరించిన జిమ్మీ చూ బ్రాండెడ్ హీల్స్ ధర సుమారు రూ. 57,000 వరకు ఉంటుందట. ఇలా కళ్లజోడు నుంచి కాళ్ల చెప్పుల వరకు ప్రతీదీ టాప్ క్లాస్ బ్రాండే.
also read:ఆదర్శ కుటుంబం నుంచి సంపూర్ణ ఇంట్రడక్షన్ వీడియో.. డైలాగ్స్ అదుర్స్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ పోస్ట్ ప్రకారం కంగానా రనౌత్ పార్లమెంట్ ఓవరాల్ లుక్ మొత్తం విలువ అక్షరాలా రూ. 1,10,57,000 (కోటి పది లక్షల యాభై ఏడు వేల రూపాయలు) దీంతో “మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పార్లమెంట్ లుక్” అంటూ ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
కచ్చితమైన ధరల్లో కాస్త అటుఇటుగా మార్పులు ఉన్నప్పటికీ, కంగానా మెయింటైన్ చేసే బ్రాండ్ వాల్యూ, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు ఈ లుక్ ఓ నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. పార్లమెంట్‌లోనూ తన రాయల్ లుక్స్‌తో వార్తల్లో నిలవడం కంగానాకే చెల్లింది.