BigTV English

Mega 157: మెగా 157పై బిగ్ అప్డేట్.. సంక్రాంతికి రావడం లేదా?

Mega 157: మెగా 157పై బిగ్ అప్డేట్.. సంక్రాంతికి రావడం లేదా?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వరుస యాక్షన్, హిస్టారికల్, ఫ్యామిలీ, కామెడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాదు ‘గాడ్ ఫాదర్’ వంటి పొలిటికల్ డ్రామా చిత్రాలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వింటేజ్ లుక్కులో మరో కామెడీ జానర్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

‘ మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి భాగం పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు సినిమా అనౌన్స్మెంట్ రోజే అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ అప్డేట్ అభిమానులలో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై సాహు గారపాటి (Sahoo garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈయన ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.


30 రోజుల షూటింగ్ పూర్తి..

“ఈ సినిమా షూటింగు దాదాపు 30 రోజులు పూర్తి చేసాము. మొదటి సగం పూర్తి కావడానికి ఒక్క సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది. అయితే సమ్మె మా మొత్తం షెడ్యూల్ ని ప్రభావితం చేసింది. లేకపోతే ఈ సమయానికి మేము రెండవ భాగంలో రెండు సన్నివేశాలను కూడా పూర్తి చేయగలిగే వాళ్ళం” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికి అయితే మొదటి పార్ట్ కంప్లీట్ అవ్వడానికి కొంత భాగమే మిగిలి ఉందని చెప్పి అభిమానులను సంతోషపరిచారు నిర్మాత.

సంక్రాంతి విడుదల కష్టమేనా?

అయితే నిర్మాత చెప్పిన మాటలు ఒక రకంగా సంతోషాన్ని కలిగించినా.. అభిమానులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. షూటింగ్ వాయిదా పడింది అంటే అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరొకవైపు సమ్మె కారణంగా షూటింగ్ నిర్విరామంగా సాగడం కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అనుకున్న సమయానికి అంటే సంక్రాంతికి ఈ సినిమాను తీసుకొస్తారా? అసలు సాధ్యమవుతుందా? అని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టెన్షన్ వీడాలి అంటే డైరెక్టర్ లేదా హీరో స్పందించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార (Nayanthara)నటిస్తున్న విషయం తెలిసిందే. మరి భారీ అంచనాల మధ్య హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమాకి సమ్మె ఎఫెక్ట్ భారీగా పడుతోందనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..

వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. మరొకవైపు యంగ్ డైరెక్టర్ లకు అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అనిల్ రావిపూడితో సినిమా పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ బాబి (Bobby kolli) డైరెక్షన్ లో కూడా చిరంజీవి సినిమా చేయబోతున్నారు.

ALSO READ:AMMA President: 31 ఏళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన నటి!

Related News

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Tollywood Producer: బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్… దుబాయి‌కి వెళ్లిపోయిన స్టార్ నిర్మాత ?

Telugu Producer : ఆ నిర్మాత సైలెంట్ ప్లేస్ లో – మీడియా ముందుకు రాను

Aamir Khan: కూలీకి 20 కోట్ల రెమ్యునరేషన్… స్వయంగా చెప్పిన అమీర్ ఖాన్

Big Stories

×