Kannada Industry : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా పలువురు ప్రముఖులు కన్నుమూస్తున్నారు. నిన్న మరాఠీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి చనిపోయిన వార్తని పూర్తిగా మర్చిపోకు ముందే తాజాగా కన్నడ ఇండస్ట్రీలో మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం కేజిఎఫ్ మూవీలో నటించిన ప్రముఖ నటుడు దినేష్ మంగళూరు తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఈయన అనేక రకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు.. కొద్దిరోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు కావడంతో వైద్యులు ఆయనని పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. నటుడి మరణ వార్తతో కన్నడ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం..
అనారోగ్య సమస్యలతో నటుడు కన్నుమూత..
కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. నిజానికి ఈయన వయసు పైబడటంతో పాటుగా కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. దినేష్ మృతి పట్ల సినీ తారలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రముఖ దిగ్గజ నటుడిని కోల్పోవడంతో కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనతోపాటు నటించినా కొందరు నటీనటులు దినేష్ మృతదేహాన్ని సందర్శించి భౌతిక నివాళులు అర్పిస్తున్నారు. మంచి మిత్రున్ని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్నివ్వాలంటూ ప్రార్థిస్తూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read : హీరో బాలయ్య పై డిప్యూటీ సీఏం ఆసక్తికర ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా..!
దినేష్ నటించిన సినిమాలు..
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేశాడు. KGF చాప్టర్ 2, KGF చాప్టర్ 2 వంటి ప్రముఖ సినిమాల్లో దినేష్ పనిచేశారు. దినేష్ గతంలో థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2022 సంవత్సరంలో KGF చాప్టర్ 2.. ఈయన KGFమూవీలో బాంబే డాన్ ‘శెట్టి’పాత్రలో నటించి తనదైన విలనిజాన్ని పండించాడు. కేవలం నటుడిగానే కాదు. ఇండస్ట్రీలోని పలు చిత్రాలకు దినేష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు.. అలాగే వీర మాటకారి, చంద్రముఖి ప్రాణసఖి, రాక్షస వంటి చిత్రాలకు పనిచేసి గుర్తింపు పొందారు.. ఇండస్ట్రీలో గొప్ప నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 55 ఏళ్ల వయసులో మెదడు సంబంధిత సమస్యలతో కన్నుమూశారు..