Kapil Sharma -Kap’s Cafe: బాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కపిల్ శర్మ (Kapil Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న కపిల్ శర్మ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన మొదటిసారి కెనడా(Canada)లో క్యాప్స్ కేప్ (Kaps Cafe)ప్రారంభించారు. అయితే ఈ కేఫ్ ప్రారంభించిన కొద్ది నెలలకే ఈ కేఫ్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే కపిల్ శర్మ పై ప్రతీకార చర్యలో భాగంగా ఈ కేఫ్ పై మాత్రమే దాడి చేశారు కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలిగించలేదు. అయితే ఈ ఘటన తర్వాత అన్ని మరమ్మతులు చేయించి తిరిగి మరోసారి ఈ కేఫ్ ప్రారంభించారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్…
ఇలా ఉగ్రదాడి జరిగిన నెలరోజుల వ్యవధిలోని మరోసారి ఈ కేఫ్ పై బుల్లెట్ల వర్షం కురిసింది. ఏకంగా ఆరు ఏడుసార్లు రెస్టారెంట్ పై కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఇక దీనిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలియజేశారు. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తూ సరైన ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ దాడి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi gang ) పని అని స్పష్టమవుతుంది. ఈ కాల్పుల తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగస్టర్ గోల్డీ థిల్లాన్ ఆన్లైన్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఈ దాడికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలియజేశారు.
ఈసారి దాడులు ముంబైలోనేనా?
ఈ దాడికి ముందు మేము కపిల్ శర్మకు ఫోన్ చేశామని అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వెల్లడించారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతోనే ఇలా కేఫ్ పై దాడి చేసినట్లు వెల్లడించారు. ఈసారి కనుక తమకు కపిల్ శర్మ స్పందించకపోతే తమ దాడి కెనడాలో జరగదని ముంబైలో జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నెలరోజుల వ్యవధిలోనే ఇలా కేకు పై రెండు సార్లు దాడి జరగడంతో కపిల్ శర్మను పూర్తిగా టార్గెట్ చేశారని తెలుస్తోంది.
ఉగ్రవాదుల డిమాండ్స్ ఏంటీ?
ఇక ఈరోజు జరిగిన దాడిలో భాగంగా ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం కలగలేదు కేవలం కేఫ్ పై మాత్రమే దాడి చేశారని స్పష్టమవుతుంది. ఇలా కపిల్ శర్మను టార్గెట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు ఒకానొక సందర్భంలో కపిల్ శర్మ లారెన్స్ వ్యవహార శైలిపై విమర్శలు కురిపించిన నేపథ్యంలోనే తనని టార్గెట్ చేశారని స్పష్టమవతుంది. మరి తాజాగా జరిగిన ఈ దాడి గురించి కపిల్ శర్మ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలా కపిల్ శర్మను లారెన్స్ గ్యాంగ్ స్టర్ తరచూ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? వారి డిమాండ్స్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.
Also Read: Rajinikanth: రజినీ కాంత్ 50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి.. 5500 ఫోటోలతో అభిమాని వింతపని!