Snake on Bike: సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో, పొలంగట్లపైనో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో పాములు ఇళ్లల్లోకి, బాత్ రూం, షూష్‌లలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో నాగుపాము కలకలం రేపింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటన ఎలా జరిగింది?
బాసర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు.. పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఉదయం పనుల నిమిత్తం బైక్‌పై బయటికి వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత, బైక్ హ్యాండిల్ దగ్గర నుంచి ఆకస్మికంగా పాము బుసలు కొట్టడం ప్రారంభించింది. మొదట అది ఇంజిన్ సౌండ్ అని అనుకున్నా, కాసేపటికే అది నాగుపాము అనే విషయాన్ని గుర్తించాడు. పాము తల ఎత్తి బైక్ హ్యాండిల్‌ను తాకుతుండడంతో.. యువకుడు వెంటనే బైక్‌ను ఆపి దూరంగా వెళ్లిపోయాడు.
పామును ఎలా గుర్తించారు?
బైక్ హ్యాండిల్, ట్యాంక్ భాగాల మధ్యలో చుట్టి ఉన్న నాగుపాము.. బుసలు కొడుతూ బయటకు రావడానికి ప్రయత్నించడంతో.. పరిసర ప్రజలు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందించారు. కొన్ని నిమిషాల్లోనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని.. పామును జాగ్రత్తగా బైక్ నుంచి బయటకు తీసారు. ఇది నాన్-వెనమస్ రాట్ స్నేక్‌గా గుర్తించారు.
స్థానికులలో కలకలం
ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో.. పాములు నివాసాల్లోకి, వాహనాల్లోకి చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు.. అరుదుగా చోటు చేసుకున్నప్పటికీ, ఇది జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన సమయం అని వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కదిలే ఏసీ.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలోకి.. ఇతడి ఐడియాకు నిజంగా పిచ్చోళ్లైపోతారు!
ఫారెస్ట్ అధికారుల సూచన
అటవీశాఖ అధికారులు స్పందిస్తూ, వర్షాకాలంలో పాములు చల్లదనాన్ని ఆశించి వాహనాల్లోకి, షూష్ లోకి, ఇళ్లోలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా పాము కాటుకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను నడిపే ముందు ఓసారి చెక్ చేసుకోండి. పామును కనుగొంటే వెంటనే 108 లేదా అటవీశాఖకు సమాచారం ఇవ్వాలి. తామే పట్టుకోవడానికి ప్రయత్నించకండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైక్ లో భారీ నాగుపాము
రెప్పపాటులో తప్పిన ప్రమాదం
పాము బుసలు కొట్టడంతో అప్రమత్తమైన వాహనదారుడు
బాసరలో ఘటన pic.twitter.com/ZYxPj038IU
— BIG TV Breaking News (@bigtvtelugu) July 19, 2025