BigTV English

Singer Lakshmi : పుష్ప 2లో ‘తిన్నతిరం పడేతలే’ సింగర్ లక్ష్మీ పాడింది.. ఆ సాంగ్ ఏంటో తెలుసా?

Singer Lakshmi : పుష్ప 2లో ‘తిన్నతిరం పడేతలే’ సింగర్ లక్ష్మీ పాడింది..  ఆ సాంగ్ ఏంటో తెలుసా?

Singer Lakshmi : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోక్ సింగర్స్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ పాటలు పాడుతూ బిజీగా ఉంటున్నారు. ఆ మాటకొస్తే సింగర్ మంగ్లీ ఒకప్పుడు జానపదాలు పాడుతూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో కూడా పాటలు పాడుతూ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఇప్పుడు మరో సింగర్ పాన్ ఇండియా చిత్రంలో పాట పాడి ఒక్కసారిగా స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకుంది.. ఆమె మరెవ్వరో కాదు తెలంగాణ ముద్దుబిడ్డ సింగర్ లక్ష్మి. ఫోక్ సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాడింది. ఆ పాట ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఊపేస్తుంది.. ఇంతకీ ఆమె పాడిన పాట ఏంటి? ఆ సినిమా పేరు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


పుష్ప2 లో లక్ష్మీ పాడిన పాట?

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర మారుమూల గ్రామం దాస లక్ష్మణ్, జయశీల దంపతులకు రెండో కుమార్తెగా జన్మించిన లక్ష్మియే ప్రస్తుత సింగర్ లక్ష్మిదాస్. తన చిన్నప్పటి నుండి తల్లి జయశీల పాడే మరాఠి కీర్తనలు, మరాఠి పాటలను తెలుగులో పాడేది లక్ష్మీ.. అలా ఎన్నో వందల పాటలు పాడింది. ముఖ్యంగా ‘తిన్నతిరం పడేతలే’ పాట మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ క్రేజ్ తోనే పుష్ప 2 సినిమాలో ఛాన్స్ వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ మూవీలో పీలింగ్స్ సాంగ్ ఎంత బాగా వైరల్ అయ్యిందో తెలుసు. ఆ పాటను తెలుగులో పాడింది లక్ష్మీనే.. తాజాగా బిగ్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాట గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.


దేవి శ్రీ పై ప్రశంసలు..

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూట్యూబ్ లో పాటను విని దేవి శ్రీ ప్రసాద్ తన మేనేజర్ తో కాల్ చేయించారు.. అలా నాతో పాటుగా మరొక మేల్ ఫోక్ సింగర్ కు అవకాశం వచ్చింది. చెన్నైలో ఈ పాటను రికార్డు చేశారు. నాలుగు రోజులు పట్టింది. మొదట లిరిక్స్ సరిగ్గా రాకపోవడంతో దేవి శ్రీ ప్రసాద్ సారు బాగా ధైర్యం చెప్పారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఆయన మాతో చాలా బాగా మాట్లాడి ధైర్యం చెబుతూ ఆ పాటలో మీ ఆయన గుర్తు చేసుకుంటూ పాడండి అంటూ సలహా ఇచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఆయన చూసే నేర్చుకున్నాను అంటూ దేవి పై లక్ష్మీ ప్రశంసలు కురిపించింది. లిరిక్స్ మార్చి మరి సాంగ్ ని వారం లోపల పూర్తి చేసాము అంటూ లక్ష్మీ అన్నారు. అయితే ఈ సాంగ్ పుష్ప 2 లోది అని మొదట నాకు తెలియదు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ రావడం చూసి నేను దేవిశ్రీప్రసాద్ గారి మేనేజర్ కి ఫోన్ చేసి కనుక్కున్నాను. అలా ఆ పాట పాడింది నేనే అంటూ లక్ష్మి అంటున్నారు.

Also Read : తెలుగులో త్రిపాత్రాభినయం చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

లక్ష్మీకి క్రేజ్ తెచ్చిన సాంగ్స్..

17 ఏళ్ల వయస్సులోనే సింగర్ గా ఎన్నో ఫోక్ సాంగ్ పాడారు లక్ష్మీ.. ఆమె పాడిన పాటల్లో ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి… తిన్నా తీరం పడతలే… అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ… అనే పాటలు ప్రతి చోటా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇదే బ్యాచ్ సినిమాలో తొలిసారిగా పాట పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘దసరా’ మూవీలో రెండోసారి వెండితెరకు అవకాశం దక్కింది. లక్ష్మి దాస్ సింగర్ వాయిస్ ను మెచ్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అవకాశం ఇవ్వడంతోనే పుష్ప 2.. సినిమాలో ఆరింటికోసారి అనే పాట పాడే అవకాశం లభించింది. ఇప్పుడు ఆ పాట అందరి నోట పాపులర్ కావడంతో సింగర్ లక్ష్మి దాస్ ఆనందంతో ఉన్నారు.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ సినిమాలు ఏంటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×