E-Paper
Advertisement

పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!

పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!
Advertisement

Kavya – Anirudh: సోషల్ మీడియాలో ఒక జంట గురించి రూమర్స్ వచ్చాయి అంటే చాలు కచ్చితంగా వారు నిజంగానే రిలేషన్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అయితే అలా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ ఒక్కోసారి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravi Chander), సినీ నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్(Kalanithi maran) వారసురాలు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ (Kavya maran) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కావ్య – అనిరుధ్ పెళ్లి డేట్ ఫిక్స్..

దీనికి తోడు ఇటీవల అనిరుధ్ మేనమామ ప్రముఖ సీనియర్ నటుడు మహేంద్ర వీరి బంధం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు అనిరుధ్ – కావ్య పెళ్లి డేట్ ఇదే అంటూ పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. పైగా నవంబర్ 10వ తేదీన వీరి ప్రేమ బంధం పుట్టిన గ్రీస్ లోనే అత్యంత వైభవంగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అటు అనిరుధ్ లేదా ఇటు కావ్యామారన్ కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం.

డెస్టినేషన్ వెడ్డింగ్..

Advertisement

పైగా గతంలో వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్లు వచ్చినా ఇరు వర్గాల వారు స్పందించకపోవడంతో ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో గ్రీస్లో నవంబర్ 10వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

also read:అగధ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి!

అనిరుధ్ రవిచందర్ కెరియర్..

Advertisement

అనిరుధ్ రవిచందర్ విషయానికి వస్తే..3 అనే సినిమాలో” వై దిస్ కొలవరి ఢీ” పాటతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తమిళ్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన అటు తమిళ్ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అవ్వగా వాటికి కూడా మ్యూజిక్ అందించి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. తొలిసారి తెలుగులో అజ్ఞాతవాసి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అనిరుద్ జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సౌత్ టు నార్త్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూ తన మార్కు చూపిస్తున్నారు అనిరుద్.

కావ్య మారన్ కెరియర్..

కావ్య మారన్ విషయానికి వస్తే.. ఎస్ ఏ 20 లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ లో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేయడమే కాకుండా సహా యజమానిగా కూడా పనిచేస్తుంది. సన్ గ్రూప్ చైర్మన్ , వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్ కుమార్తె ఈమె. 2018 నుండి సన్రైజర్స్ కి సీఈఓ గా పనిచేస్తున్న కావ్య సన్ నెట్వర్క్, సన్ మ్యూజిక్, ఎఫ్ఎం ఛానల్స్ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. ఈమె ఆస్తుల విలువ సుమారుగా రూ.410 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×