E-Paper
Advertisement

అగధ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి!

అగధ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి!
Advertisement

Agadha Movie: పొలిమేర , పొలిమేర 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ప్రధాన పాత్రలో, సీనియర్ దర్శకుడు ఎంఎస్ రాజు (MS Raju) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అగధ. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి ఇచ్చిన సర్ప్రైజ్ కి ఆడియన్స్ మరింత ఫిదా అవుతున్నారు. మరి ఆ అసలు సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అగధ స్థాయిని పెంచిన నటీనటుల పర్ఫామెన్స్..

అగధ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెగ్యులర్గా వచ్చి వెళ్లిపోయే సినిమాలకు, ముఖ్యంగా హారర్ జానర్ లో మనం చూసే చిత్రాలకు చాలా భిన్నమైన సినిమా ఇది. నిజానికి దీనికి కేవలం హారర్ సినిమా అని పిలవడం కూడా ఈ సినిమాకు న్యాయం చేయకపోవచ్చు. మిస్టిసిజం, సూపర్ నేచురల్ అంశాలతో అల్లుకున్న ఒక అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. దీనికి తోడు నటీనటుల అద్భుతమైన పర్ఫామెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి..

Advertisement

also read:అల్లు అర్జున్ కి తప్పని తిప్పలు.. వాయిదా పడ్డ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేస్?

శ్రవణ్ రెడ్డి సర్ప్రైజ్ అదుర్స్..

ఇందులో శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలు ఎన్నో లేయర్స్ ఉన్నాయి. మొదట్లో చాలా సహజంగా మనకు తెలిసిన వ్యక్తిలా కనిపించే ఆ పాత్ర.. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్క కొత్త కోణాన్ని బయటపెడుతుంది. ఆ మార్పులను శ్రవణ్ చాలా తేలికగా తన నటనతో తీసుకొచ్చాడు. ముఖ్యంగా అతని పర్ఫామెన్స్ లో ఒక రకమైన సెట్టింగ్ క్వాలిటీ ఉంటుంది. అది కావాలని భయపడటం వల్ల కాదు ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాం అనుకునే అవకాశాన్ని అతను ప్రేక్షకుడికి ఇవ్వకపోవడం వల్ల ఇక పాజిటివ్ – నెగిటివ్ షేడ్స్ మధ్య ఉండే ఆ క్లిష్టమైన జోన్లను శ్రవణ్ ఎంతో సమర్థవంతంగా పట్టుకున్నాడు. అతను ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో కూడా ఆ పాత్రలో ఇంకేదో దాగి ఉందనే భావన మనల్ని వెంటాడుతుంది. సినిమా మొదట్లో మనం చూసిన పాత్రను, చివరికి పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాడు. చాలా కంట్రోల్ అస్యూర్డ్ పర్ఫామెన్స్ ఇది సినిమా అండ్ కార్డ్స్ పూర్తయ్యాక కూడా మనతో ఉండిపోయిన చిత్రం అగధ. ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలను శ్రవణ్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు.

Related News

తారక్‌ కూడా అదే రూట్‌లోకి.. మరో కుంపటి రెడీ!

బాలయ్య NBK 112 ఆగిపోయిందా? కొరటాల నెక్స్ట్ ఏంటి?

షూటింగ్‌లో లేట్, సెట్‌లో ఫోన్.. అసలు విషయాలు కక్కేసిన సెలబ్రిటీలు

శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే

ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా.. తేజ వైరల్ కామెంట్స్

బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

చెత్త యానిమేషన్ అని తిట్టారు.. రూ.లక్షతో తీస్తే కోట్లు కొల్లగొడుతోంది

Big Stories

Advertisement
×