Mahalaxmi scheme: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చి పథకంలో కీలకమైంది మహాలక్ష్మి పథకం. దీనికింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అలాగే రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు రాయితీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. రాయితీ నగదును ప్రతీ నెల కాకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తోంది.
వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ నిధులను లబ్దిదారుల అకౌంట్లలో జమ చేయిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌ని రూ.500లకే ఇస్తోంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.855 ఉంది. లబ్దిదారులు సిలిండర్ కోసం బుక్ చేసుకున్నప్పుడు మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రూ.500 లకే ఇవ్వాలి. లబ్దిదారులు చెల్లించిన డబ్బులో రూ.355ని వెనక్కి సబ్సిడీ రూపంలో వెనక్కి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
వాటిని బ్యాంకుల ద్వారా లబ్దిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. చాలామంది సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ డబ్బు అకౌంట్లలోకి రావడం లేదు. దీంతో 2 లేదా 3 సిలిండర్ల డబ్బును ఒకేసారి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఆ లెక్కన 3 లేదా 4 నెలలకు ఒకేసారి డబ్బులు పడుతున్నాయి.
గ్యాస్ రాయితీ పథకం ప్రారంభమైన మొదట ప్రతీ నెలా డబ్బులను చెల్లించింది ప్రభుత్వం. లబ్ధిదారులు బ్యాంకు ఖాతా నెంబర్లు, ఆధార్ తప్పుగా ఇవ్వడంతో వారికి చెల్లింపులు జరగలేదు. యాక్టివ్‌గా ఉన్న లబ్దిదారుల బ్యాంకు అకౌంట్ నెంబర్లను గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో వారి అకౌంట్లలో డబ్బు జమ అవుతున్నాయి.
ALSO READ: నిజామాబాద్ పసుపు బోర్డు.. రైతులకు కలిగే లాభమేంటి?
గ్యాస్ సబ్సిడీ డబ్బులు కొందరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ కాగా, మరి కొందరికి ఏప్రిల్‌లో జమయ్యాయి. ఎవరి అకౌంట్లలో డబ్బులు జమ కాకపోతే నేరుగా గ్యాస్ ఏజెన్సీ లేదా బ్యాంకుకు వెళ్లి తమకు సబ్సిడీ వచ్చిందో తెలుసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఎన్ని సిలెండర్లకు సబ్సిడీ డబ్బు రాలేదో తెలుసుకోవాలి.
ఆ వివరాలు ఓ చోట రాసి పెట్టుకుంటే మరోసారి జమ చేసినప్పుడు ఆ పెండింగ్ డబ్బులు జమ కానున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలియని చాలామంది లబ్దిదారులు తమకు డబ్బులు జమ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీల దగ్గర గొడవకు దిగుతున్నారు. వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన ఏజెన్సీ సిబ్బంది చెప్పక మాకు తెలీదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి కొంత ఆలస్యమైనా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. లబ్దిదారుల ఖాతాల్లో డైరెక్ట్ బెనెఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ ఎల్పీజీ ద్వారా డబ్బు జమ అవుతోంది. అందువల్ల లబ్దిదారులు ఎవరైనా తమకు సబ్సిడీ డబ్బులు రావలేదని భావిస్తే బుక్ చేసుకుంటున్న సిలిండర్ల వివరాల్ని జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి.
గ్యాస్ ఏజెన్సీలో కంప్లైంట్ ఇచ్చే సమయంలో ఆ వివరాలు అందజేయవచ్చు. దానివల్ల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిధులు మిస్ కావు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో రేషన్ కార్డుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి 39.57 లక్షల మంది అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం.