E-Paper
Advertisement

Khushbu Sundar: మెగా, వెంకీ మ్యాజిక్‌కు ఖుష్బూ ఫిదా.. రివ్యూ చూశారా!

Khushbu Sundar: మెగా, వెంకీ మ్యాజిక్‌కు ఖుష్బూ ఫిదా.. రివ్యూ చూశారా!
Advertisement

Khushbu Sundar: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా తుఫాన్ ఎలా ఉంటుందో సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా నిరూపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victor Venkatesh) కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నాల్గవ వారంలోకి ఎంటరైంది. ఈ సినిమాపై సెలబ్రిటీలెందరో ప్రశంసలు కురిపించారు. దాదాపు 3 వారాలు ముగిసిన అనంతరం సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ వేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సినిమాపై చిన్నపాటి రివ్యూనే ఇచ్చేశారు. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్’ అంటూ ఆమె ఇచ్చిన రివ్యూ (Khushbu Sundar MSG Review).. ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఆమె ట్వీట్‌ను మెగా విక్టరీ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ.. ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంతకీ ఆమె ట్వీట్‌లో ఏముందంటే..

Also Read- Sankranthi 2027: ఈసారి సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, వెంకీ.. ఇది కదా పోటీ అంటే!

ది ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్

Advertisement

దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ అంటేనే లాజిక్కులకు అతీతమైన మ్యాజిక్. అదే విషయాన్ని ఖుష్బూ ఈ ట్వీట్‌లో చెప్పారు. ‘అనిల్ రావిపూడి తనను తాను ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా మరోసారి నిరూపించుకున్నారు’ అని కొనియాడుతూ.. కేవలం వినోదాన్ని నమ్ముకుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక ఫెస్టివల్ వంటిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి మెగా అభిమాని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేస్తున్నాయంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ‘మీ మీద ప్రేమ చూపించే వారి కోసం మీరు ఇచ్చే బెస్ట్ అవుట్‌పుట్ అద్భుతం. మీరు నిజంగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్’ అంటూ చిరు ఎనర్జీని ఆకాశానికెత్తేశారు. మెగాస్టార్‌కు మరింత ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని దేవుడ్ని కోరుతూ.. ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుండాలని కోరారు.

Also Read- Idiot Movie: ఇడియట్ సినిమా ఇసుక సీన్ గుర్తుందా..ఈ సీన్ కు ఇన్ని అవార్డులు వచ్చాయా?

గ్రేస్ అండ్ లవ్

Advertisement

ఇక తన మిత్రుడు వెంకటేష్ గురించి చెబుతూ తనలోని సెంటి, మెంటల్ కోణాన్ని బయటపెట్టారు ఖుష్బూ. ‘I Love You Venku’ అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్ సరసన చేసిన ‘కలియుగ పాండవులు’ సినిమాతోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందుకే వెంకీపై తన లవ్‌ని ఆమె ఈ ట్వీట్‌లో తెలియజేశారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతారను ‘ఎపిటోమ్ ఆఫ్ గ్రేస్’ అని అభివర్ణించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నాకు ఎంతగానో నచ్చింది. ఐ లవ్ ఇట్ అంటూ సినిమాపై ఎమోజీలతో ఆమె ప్రేమ కురిపించారు. ఖుష్బూ ట్వీట్ చూసిన తర్వాత.. ఈ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని తోటి నటీనటుల మనసును కూడా గెలుచుకుందని అర్థమవుతోంది. ఇక ఖుష్బూ చేసిన ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీ బ్రదర్ (‘స్టాలిన్’లో ఖుష్బూ సోదరుడిగా చిరు చేశారు) సినిమాపై ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు మేడమ్.. అని ఎక్కడెక్కడికో లింక్స్ కలుపుతున్నారు.

Also Read- Dhurandhar 2 OTT:ఓటీటీ  పార్ట్నర్ ను మార్చేసిన ధురంధర్ 2 … ఈ సారి స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×