E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? డూప్లికేట్ ఫొటోలు, వీడియోలను ఇలా ఈజీగా డిలీట్ చేయండి!

స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? డూప్లికేట్ ఫొటోలు, వీడియోలను ఇలా ఈజీగా డిలీట్ చేయండి!
Advertisement

Phone Storage Tips: మనలో చాలామందికి నచ్చిన దానిని పదే పదే ఫోటోలు తీసే అలవాటు ఉంటుంది. అయితే వాటిలో ఒకటి లేదా రెండు మాత్రమే బాగుంటాయి.. మిగిలినవన్నీ గ్యాలరీలోనే ఉండిపోతాయి. వీటితో పాటు వాట్సప్ సందేశాలు, స్క్రీన్‌షాట్లు, పెద్ద పెద్ద వీడియోల వల్ల ఫోన్‌ స్టోరేజ్ చాలా వేగంగా నిండిపోతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో డూప్లికేట్ ఫొటోలను తొలగించి ఫోన్ స్టోరేజ్‌ను సులభంగా ఖాళీ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం..

స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టండిలా..

ఫోన్‌లో అనవసరమైన ఫొటోలు, వీడియోలు ఎక్కువగా ఉన్నప్పుడు స్టోరేజ్ నిండిపోవడమే కాకుండా ఫోన్ వేగం కూడా తగ్గిపోతుంది. కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేయాలన్నా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలన్నా స్పేస్ ఉండదు. అందుకే గ్యాలరీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా ఫోన్ పనితీరును మెరుగుపరుచుకోవడమే కాకుండా.. కొత్త మెమెరీస్ కోసం స్పేస్ క్రియేట్ చేయవచ్చు.

Advertisement

Also Read: పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే స్కిన్ మెరిసిపోయే 7 మ్యాజికల్ గ్యాడ్జెట్స్ ఇవే!

ఆండ్రాయిడ్‌లో క్లీనింగ్ ప్రాసెస్..

ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా Google Files యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్‌ ఓపెన్ చేసి Clean విభాగంలోకి వెళ్తే.. ఫోన్‌లో ఉన్న జంక్ ఫైల్స్, స్క్రీన్‌షాట్లు, పెద్ద ఫైళ్లతో పాటు అనవసరమైన డేటాను అది చూపిస్తుంది. వాటిని ఒకసారి పరిశీలించి డిలీట్ చేయవచ్చు. ఇంకా ఎక్కువ డూప్లికేట్ ఫొటోలు ఉంటే ప్లే స్టోర్ నుండి సురక్షితమైన థర్డ్ పార్టీ యాప్‌లను కూడా వాడుకోవచ్చు.

ఐఫోన్ యూజర్లకు మరింత సులభం..

Advertisement

ఐఫోన్ వాడుతున్న వారికి ఈ పని ఇంకా చాలా తేలిక. ఐఫోన్లోని Apple Photos యాప్ ఒకేలా ఉన్న ఫొటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా గుర్తించేస్తుంది. దీనికోసం ఫొటోస్ యాప్‌లో యూటిలిటీస్ విభాగానికి వెళ్లి Duplicates ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఒకేలా ఉన్న ఫొటోలు కనిపిస్తాయి, వాటిని రివ్యూ చేసి మెర్జ్ చేయడం లేదా తొలగించడం చేయవచ్చు.

స్టోరేజ్ పెంచుకోవాలంటే..

ఒకేసారి ఎక్కువ ఫైళ్లను తొలగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన ఫొటోలు లేదా డాక్యుమెంట్లు డిలీట్ కాకుండా చూసుకోవడానికి, ఒకసారి మ్యాన్యువల్‌గా చెక్ చేయడం మంచిది. వీలైతే ముఖ్యమైన జ్ఞాపకాలను ముందే క్లౌడ్‌లో బ్యాకప్ చేసి పెట్టుకోవాలి. వారానికి ఒక్కసారైనా గ్యాలరీని సరిచూసుకుంటే ఫోన్ ఎప్పుడూ స్మూత్‌గా పనిచేస్తుంది.

Also Read: Apple Watch Series 12లో కొత్త ప్రాసెసర్, ఎఐ ఫీచర్లు.. యాపిల్ లవర్స్‌కు పండగే!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×