King 100 Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్, నవ మన్మధుడు, అక్కినేని హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున (Nagarjuna) ఎట్టకేలకు తన మైలురాయి 100వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. #King100 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ (Ra.Karthik )దర్శకత్వం వహిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాగార్జున కెరియర్లో ఒక చిరస్మరణీయమైన మైలురాయిగా నిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్, గ్లింప్స్ విడుదల చేస్తామని మేకర్స్ ఆగస్టు 28న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎట్టకేలకు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తూ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. కింగ్ 100 అంటూ వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇకపోతే టైటిల్ విడుదలతో పాటు రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికైతే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడగా.. సంక్రాంతికి ముందుగానే ఈ సినిమా క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే అక్కినేని నాగార్జున వారసులైన అఖిల్ అక్కినేని, నాగచైతన్య అక్కినేని ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించారు. ఇప్పుడు నాగార్జున కూడా ఈ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరి ఆ మైలురాయిని అందుకుంటారా ? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
ALSO READ:ది ప్యారడైజ్ నుంచి దుమ్ము రేపుతున్న ‘యేష నాగుల కట్ట మీద’ మాస్ ట్రాక్!
తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ విషయానికొస్తే.. “మనుషుల్లో రెండు రకాలు.. డబ్బున్నోళ్లు. డబ్బు లేని వాళ్ళు.. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు ఉన్నప్పుడు.. దే కాల్ మీ ది కింగ్. గుర్తింపు.. డబ్బు కంటే చాలా శక్తివంతమైంది. ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి” అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే నాగార్జున ఈ 100 వ సినిమాతో రికార్డు సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. రాజా మహదేవన్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా.. డిజైనర్ గా సతీష్ కుమార్ ఎం వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నిర్మిస్తోంది.