Kingdom film:. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా కింగ్డమ్ (Kingdom)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండకు కూడా దాదాపు ఏడు సంవత్సరాలు తర్వాత మంచి హిట్ రావడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర స్టార్ హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కింగ్డమ్ థియేటర్లలో ప్రదర్శితం అవుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు తమిళనాడులో (Tamilanadu) నిరసన సెగ తగిలింది.
ఫ్లెక్సీలను తొలగించిన తమిళ ప్రజలు…
తాజాగా తమిళనాడులో ఒక థియేటర్ వద్ద ఈ సినిమా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో కొంతమంది థియేటర్ ఆవరణంలోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించిపడేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన సినీ ఫ్లెక్సీలను చిపివేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే… రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రాగా తమిళంలో మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది.
తమిళ ప్రజలు విలన్లా?
ఇలా తమిళంలో నెగిటివ్ టాక్ రావడం వెనుక కారణం లేకపోలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఈలం లోని తమిళ ప్రజలను విలన్లుగా చూపించిన నేపథ్యంలోనే తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం కాస్త ముదరడంతో తమిళనాడులోని ఓ థియేటర్లో సినిమా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో బ్యానర్లను తొలగిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా కింగ్డమ్ సినిమాకు తమిళనాడులో నిరసన సెగ ఎదురవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి చిత్రబృందం ఎక్కడ స్పందించలేదు.
#Kingdom – banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy
— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే కింగ్డమ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి వరుస సినిమాలను లైన్లో పెట్టారు. తన తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ ప్రకటన కూడా వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాల పైకి వెళ్లలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.
Also Read: Jr.NTR: నాకు అలా బ్రతకడమే ఇష్టం… కుటుంబ వారసత్వం పై ఎన్టీఆర్ కామెంట్స్!