BigTV English

Kingdom Song Promo : కింగ్డమ్ సినిమాలో గురూజీ వేలు పెట్టారా.? డైలాగ్ ఏదో అలానే ఉందే

Kingdom Song Promo : కింగ్డమ్ సినిమాలో గురూజీ వేలు పెట్టారా.? డైలాగ్ ఏదో అలానే ఉందే
Advertisement

Kingdom Song Promo : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలలో మంచి అంచనాలు ఉన్న సినిమా కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా మీద విజయ్ కూడా మంచి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఊహిస్తున్నారు. నాగ వంశీ కూడా పలు సందర్భాల్లో ఇదే మాటను చెబుతూ వచ్చాడు.


సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుంచి నాగ వంశీ మాట్లాడుతూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. లాజికల్ గా కూడా మీరు ఏం అడిగినా కూడా దీనికి నేను సమాధానం చెబుతాను. మీరు దీనికి ఎన్నో లెక్కలేసుకుని మరి చూడొచ్చు అంటూ చెబుతూ వచ్చారు.

కింగ్డమ్ లో గురూజీ ఇన్వాల్వ్మెంట్ 


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గురూజీ అనగానే టక్కని గుర్తు చెప్పారు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా విడుదలైన వెంటనే త్రివిక్రమ్ కి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగులు చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఆ డైలాగులు కూడా త్రివిక్రమ్ సిగ్నేచర్ ఉంటుంది. ఇక రీసెంట్గా కింగ్డమ్ సినిమా నుంచి అన్నా అంటే అనే ప్రోమో సాంగ్ విడుదలైంది. దీనికంటే ముందు ఒక డైలాగ్ పడింది. “మర్చిపోవడానికి వాడేమన్న గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న నా అన్న వాడు” అనే డైలాగ్ తర్వాత పాట మొదలైంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో దాదాపు ఇలాంటి డైలాగే ఉంటుంది. మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా, జీవితం అంటారు. అయితే కింగ్డమ్ సినిమాలో ఇటువంటి డైలాగ్ వినగానే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యారా అని చాలామందికి అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ అంటే గురూజీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చాలా మందికి తెలిసిన విషయమే.

ఎమోషన్ పట్టుకున్నాడు 

గౌతమ్ తిన్ననూరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎమోషన్స్ పండించడంలో గౌతమ్ పండిపోయాడు. జెర్సీ సినిమాలో కూడా తండ్రి కొడుకులు మధ్య అద్భుతమైన ఎమోషన్ చూపించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ని చూపించబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ పాటను అనిరుద్ పాడారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Related News

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Big Stories

×