Illu Illalu Pillalu Today Episode july 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోకి వెళ్ళగానే రామరాజు ఇలాంటి మాటలు పడాలని రా మీరు దారిలో ఉండాలి మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను.. కోడలి నగలతో నేను ఇంటిని గడుపుతున్నానా..? అందరి చేత నన్ను ఇన్ని మాటలు అనిపిస్తున్నారే మీకు నేను ఏం ద్రోహం చేశాను అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడకండి అని వేదవతి దగ్గరకు వచ్చి అడగ్గానే నన్ను ముట్టుకోవద్దు అని రామారాజు సీరియస్ అవుతాడు. ఈ లోకంలో నా నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేదు. నాకోసం మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చావని నిన్ను ఎంతో గొప్పగా చూసుకున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊరు అనుకోలేదు అని రామరాజు వేదవతి తో అంటాడు. నగల విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని వేదవతిని అడుగుతాడు. పెద్దోడివి పెళ్లి హడావిడిలో మర్చిపోయాను అండి చెప్పడం అని అంటుంది వేదవతి.. వేదవతిని ఇంకా జన్మలో నువ్వు నాతో మాట్లాడొద్దు అని రామరాజు అరుస్తాడు. ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి నన్ను క్షమించత్తా అని అంటుంది. ఏం ద్రోహం చేశానే నిన్నే నీకేం పాపం చేశాను నేను.. నా మీద ఒట్టేసావు కదా మరి నేనంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా? అని అరుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శారదాంబ ఎంత చెప్పినా కూడా సేన భద్రావతి వినకుండా ప్రేమ కష్టపడడం మాకు నచ్చలేదు అంటూ బాధపడతారు. ఇక ధీరజు వాళ్ళ నాన్న జీవితంలో ఇంకా తన మొహం చూడడని బాధపడుతూ తన అన్నయ్యలతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇంట్లో జరిగిన గొడవకి నీకు ఏ సంబంధం లేదు రా.. నిన్నెందుకు నాన్న దూరం పెడతాడు నువ్వేం బాధపడకు అని ఓదారుస్తారు. ఇప్పటివరకు నేను ఆ ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్ల నా మీద కోపంగా ఉన్నారు నాన్న. ఇప్పుడు ఆ ప్రేమ వల్లే జరిగిన అవమానం వల్ల నాకు శాశ్వతంగా దూరమైపోతాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధీరజ్..
ధీరజ్ బాధను చూసి సాగర్ ఇప్పుడు జరిగిన గొడవకి నీకు ఎటువంటి సంబంధం లేదురా.. కన్న కొడుకుని దూరం చేసుకుని అంత కసాయి కాదు నాన్న అని అంటాడు. ఏమో అన్నయ్య ఇంక నాన్న ఏం చేస్తాడో ఏమో అర్థం కావట్లేదు అని ముగ్గురు కొడుకులు బాధపడుతూ ఉంటారు. అటు వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి ఇందులో నా తప్పేమీ లేదు అని అంటుంది. నగల విషయం నాకు చెప్పకుండా నువ్వు తప్పు చేశావు బుజ్జమ్మ. వాళ్లు నన్ను అన్ని మాటలు అంటున్నా నాకు బాధ లేదు కానీ నువ్వు నా దగ్గర నిజం దాచి పెట్టావని బాధే నాకు ఎక్కువగా ఉంది అని రామరాజు అంటాడు.
ఇంక నాతో మాట్లాడరా అండి మీరు అని బుజ్జమ్మ రామరాజు ని అడుగుతుంది. నీతో మాట్లాడకుండా నేనెలా ఉండగలను బుజ్జమ్మ కచ్చితంగా మాట్లాడతాను అని అంటాడు. మంచి కోడల్ని దేవుడిచ్చాడు అని అనుకున్నాను కానీ ఇలా నన్ను అవమానించే కోడల్ని ఇస్తాడని అస్సలు అనుకోలేదంటూ రామరాజు బాధపడతాడు. ప్రేమ ధీరజ్ బాధని చూసి క్షమాపణ చెప్పాలని అనుకుంటుంది. దగ్గరికి వచ్చి ఎంతగా సారీ చెప్తున్నా సరే ధీరజ్ వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ అద్దంపై సారీ అని రాసి ఉండడం చూసి కోపంతో ప్రేమను ఏంటి తమాషా చేస్తున్నామని అడుగుతాడు.
నాన్న వాళ్ళు ఇలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు నాకెంత బాధగా ఉందో మీకు తెలియదు అని ప్రేమ అంటుంది. నేను కష్టపడి పోతున్నాను అని నీకు ఎవరు చెప్పారు? నేను ట్యూషన్ చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. అలాగే డాన్స్ క్లాసులు చెప్పొద్దని మా నాన్న కూడా చెప్పాడు? అయినా నువ్వు మాట వినకుండా ఎందుకు వెళ్లావు అని ప్రేమను నిలదీస్తాడు ధీరజ్.. నువ్వు నా బాధ్యత అని ధీరజ్ అంటాడు. అలాగే ప్రేమ నువ్వు నా మొగుడివి కాబట్టి నేను నిన్ను బాధ్యతగా ఫీల్ అవుతున్నానని అంటుంది.
శ్రీవల్లి మాత్రం ఇంట్లో జరుగుతున్న గొడవలకు చాలా సంతోషంగా ఉంది నా బండరం బయటపడుతుంది. అనుకుంటే వీళ్ళల్లో వీళ్లే కొట్టుకొని చస్తున్నారు అంటూ డాన్స్ చేస్తూ సంతోషపడుతుంది. నాకు కాపురం ఎక్కడ కూలిపోతుందని నేను చాలా బాధపడ్డాను భయపడ్డాను.. దేవుడున్నాడు వీళ్ళలో వీళ్లే కొట్టుకొని చచ్చేలా చెయ్యి అని దేవుని కోరుకుంటుంది.. అటు సాగర్ తన తండ్రికి జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. నర్మదకు దూరంగా వెళుతుంటాడు. నర్మదా ఎంతగా బ్రతిమలాడుతున్న సరే మాట్లాడకుండా బయటికి వెళ్లిపోతాడు.
గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు బుక్స్ బయట చదవాల్సిన అవసరం లేదు.. ఇక్కడే నువ్వు కూర్చుని చదువుకోవాలి. దానికి సీరియస్ అయినా సాగర్ బుక్స్ ని దూరంగా విసిరి కొడతాడు. ప్రేమకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని అరుస్తాడు. ప్రేమ వచ్చేసిందంటే తప్ప ఏమీ లేదు కదా.. నువ్వు ప్రేమని సపోర్ట్ చేసిన విషయం కాదు.. ప్రేమ డాన్స్ క్లాస్ చేస్తున్న విషయం నీకు తెలిసి కూడా నా దగ్గర దాచావు చూడు అది నాకు కోపంగా ఉంది అని సాగర్ అంటాడు.
ప్రేమ నాకు చెప్పలేదు అని ఎంత చెప్పినా కూడా నర్మద మాట వినడు సాగర్. ప్రతి చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్న ప్రేమ ఈ విషయాన్ని నీతో పంచుకోకుండా ఉంటుందా? కంటికి నేను పిచ్చోడి లాగా కనిపిస్తున్నానా అని సాగరు నర్మదపై సీరియస్ అవుతాడు. నీకోసం నేను ఎంత చేస్తున్నానో రైస్ మిల్లును మా నాన్న తర్వాత వారసత్వంగా నేను చూసుకోవాలి అనుకున్నాను. నీ మీద ప్రేమతో నీ పుట్టింటి వాళ్ళని నీకు దగ్గర చేసేందుకే గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇంత చేస్తున్నా నువ్వు నా దగ్గర నిజం దాచి పెట్టి నన్ను మోసం చేశావు ఇది నేను సహించలేకపోతున్నానని సాగర్ వెళ్లిపోతాడు.
Also Read :అవనిని కాపాడిన అక్షయ్.. పల్లవి అనుమానమే నిజామా? అవనికి షాక్..
చందు వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తుంటే శ్రీవల్లి ఆపుతుంది. నా తమ్ముళ్ళ అంత బాధ పడుతుంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను అనుకుంటున్నావు. ఈరోజు నేను నా తమ్ముడు దగ్గరే పడుకుంటాను అని మళ్లీతో అంటాడు. మీకు మీ తమ్ముళ్లే ముఖ్యం నేనంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు లేకుండా ఉంటే నాకు నిద్ర పట్టదు బావ లోపలికి వెళ్దాం పద అని తీసుకెళ్లి పోతుంది. మీ తమ్ముళ్ళతో నిన్ను అసలు కలవనివ్వను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో కోడళ్ళకి వేదవతి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..