Jabardast Naresh: గత 12 సంవత్సరాలుగా ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardast). ఈ వేదిక ఎంతో మందికి జీవితాలను ప్రసాదించింది. ఈ షోలో తమ టాలెంట్ ను నిరూపించుకున్న ఎంతోమంది కమెడియన్లు.. ఇండస్ట్రీలో హీరోలుగా, దర్శకులుగా, కమెడియన్లుగా సెటిల్ అయిపోయారు. ఇక ఇప్పటికీ ఈ షోని నమ్ముకొని కెరీర్ ను కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పొట్టి నరేష్ (Potti Naresh) కూడా ఒకరు.. చూడడానికి పొట్టిగా ఉన్నా.. తన అద్భుతమైన టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
షబీనా షేక్ తో పొట్టి నరేష్ లవ్ ట్రాక్..
ఇకపోతే ఈ జబర్దస్త్ షోలో కామెడీ చేయడమే కాకుండా లవ్ ట్రాక్ కూడా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ సీరియల్ నటి షబీనా షేక్ (Sabina Shaikh) తో నరేష్ లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత షబీనా వివాహం చేసుకొని వెళ్లిపోవడంతో.. నరేష్ ఒంటరివాడైపోయాడు. దీంతో ఇక నరేష్ లవ్ లో ఫెయిల్ అయ్యాడని, చాలామంది పలు రకాల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ అసలు నిజం బయటపెట్టారు.
లవ్ ట్రాక్ పై స్పందించిన పొట్టి నరేష్..
షబీనా షేక్.. ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో నటించిన ఈమె యాంకర్ గా కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత సీరియల్స్ లో ఆఫర్ల కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు దక్కకపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో మెరిసింది. ఆ తర్వాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో ఈమె పేరు బాగా వినిపించింది. ముఖ్యంగా పొట్టి నరేష్- షబీనా కాంబినేషన్లో వచ్చిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. దీంతో వీరిపై రకరకాల గాసిప్లు వినిపించాయి. ఆ తర్వాత షబీనా ఇంకో వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. ఇక తాజాగా షబీనాతో లవ్ ట్రాక్ గురించి అడిగితే తెగ సిగ్గు పడిపోయాడు నరేష్. అంతే కాదు ఆమె పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించడంతో.. దానికి కూడా సమాధానం ఇచ్చారు.
లవ్ పై నిజం చెప్పేసిన పొట్టి నరేష్..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ..” నా హైట్ వల్ల నాకెప్పుడూ కూడా ప్రాబ్లం రాలేదు. నా పెళ్లి గురించి ఏదేదో అనుకుంటున్నారు. కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరో రెండు సంవత్సరాల సమయం పడుతుంది. నాకు కాబోయే భార్య విషయంలో ఎలాంటి ఆలోచనలు లేవు. తెల్లగా ఉండాలి. అందంగా ఉండాలి. అలాంటి ఆశలు అసలే లేవు. మా అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటే చాలు. ఇండస్ట్రీ అమ్మాయి అయినా బయట అమ్మాయి అయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇక షబీనాతో లవ్ ట్రాక్ అనేది స్కిట్ వరకు మాత్రమే. అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు.ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. పెళ్లికి ముందు నాతో లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది కూడా రోజా గారే. మొదట్లో కార్తీక్ అన్నతో లవ్ ట్రాక్ ఉండేది . ఆ తర్వాత ఆ ట్రాక్ ను నా వైపు కన్వర్ట్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిని నేను బాగా ఫ్లర్ట్ చేసే వాడిని. ఆ అమ్మాయి మాటలకు పడిపోయేది అంటూ తన లవ్ ట్రాక్ గురించి చెప్పుకొచ్చారు.
అందుకే షబీనా పెళ్లికి వెళ్లలేదు – పొట్టి నరేష్
ఆమెకు పెళ్లయిపోయింది. నాకు ఆ బాధ లేదు. ఆమె పెళ్లికి నన్ను పిలిచింది. కానీ నేను వెళ్లలేదు. ఎక్కడో గుంటూరులో పెళ్లి చేసుకుంది. వెళ్లడం కుదరలేదు. నేను పెళ్లికి వెళ్లి ఉంటే పెళ్లి మండపం నుంచి లేచి వచ్చేదేమో.. నా వల్ల జీవితాలు పాడవకూడదని ఆమె పెళ్లికి వెళ్లలేదు అంటూ సరదాగా కామెంట్లు చేశారు. ఇక తాను శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి వచ్చే చాలా మంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతానని, కానీ వాళ్ళందరూ వీడియో పిల్ల నాయాల అని వదిలేస్తారు.. అందరూ మంచివాళ్లే అంటూ తన ప్రేమ కథలను కూడా చెప్పుకొచ్చారు నరేష్..
ALSO READ:Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజకు తండ్రి కన్నుమూత!