E-Paper
Advertisement

అంతరిక్షంలో ఇస్రో సంచలన రికార్డు.. నింగిలోకి అత్యాధునిక EOS-05 ఉపగ్రహం!

అంతరిక్షంలో ఇస్రో సంచలన రికార్డు.. నింగిలోకి అత్యాధునిక EOS-05 ఉపగ్రహం!
Advertisement

EOS-05 Launch: అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో మైలురాయికి అడుగు దూరంలో ఉంది. భూమిని అత్యంత స్పష్టతతో పరిశీలించే అత్యాధునిక ఉపగ్రహం EOS-05 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గతంలో విఫలమైన GISAT-1 ప్రయోగం తర్వాత.. అదే లక్ష్యంతో EOS-05 ఉపగ్రహాన్ని GSLV-F17 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమైంది.

ఉపగ్రహాలకు భిన్నంగా..

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. భూమి చుట్టూ తిరుగుతూ పరిశీలించే సాధారణ ఉపగ్రహాలకు భిన్నంగా.. జియోసింక్రోనస్ కక్ష్యలో ఉండి, ఒకే ప్రాంతాన్ని నిరంతరం గమనించగలదు. దీంతో వాతావరణ మార్పులు, తుపాన్లు, మేఘాల కదలికలు.. ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడంలో మరింత ఖచ్చితత్వం సాధ్యమవుతుంది.

Advertisement

Also Read: ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

2021 ఆగస్టులో..

అయితే ఈ ప్రయోగం వెనుక ఓ సవాలుతో కూడిన గతం కూడా ఉంది. 2021 ఆగస్టులో GISAT-1 ఉపగ్రహాన్ని GSLV-F10 రాకెట్ ద్వారా ప్రయోగించగా.. క్రయోజెనిక్ స్టేజ్‌లో ప్రాబ్లమ్ వచ్చి మిషన్ ఫెయిల్ అయింది. అదే కలను సాకారం చేసుకునేందుకు ఇస్రో మరింత పటిష్టంగా సిద్ధమైంది. ఇప్పుడు EOS-05 రూపంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తోంది.

EOS-05 అంటే..

Advertisement

EOS-05 అంటే కేవలం మరో శాటిలైట్ మాత్రమే కాదు.. ఐదేళ్ల క్రితం ఆగిపోయిన ఓ మిషన్‌కు సరికొత్త ఆరంభం. భారత్ నిరంతర భూ పరిశీలన సామర్థ్యాలను పెంచుకునే దిశలో ఇది కీలక అడుగు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యానికి మరో గుర్తింపు రానుంది. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, విజయంపై గురి పెట్టిన ఇస్రో.. EOS-05తో అంతరిక్షంలో మరో చరిత్ర రాసేందుకు సిద్ధమవుతోంది.

Also read: ఏఐ టెక్నాలజీతో సంచలనం.. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ నినాదంతో షార్ట్ ఫిల్మ్!

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×