E-Paper
Advertisement

ఏఐ టెక్నాలజీతో సంచలనం.. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ నినాదంతో షార్ట్ ఫిల్మ్!

ఏఐ టెక్నాలజీతో సంచలనం.. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ నినాదంతో షార్ట్ ఫిల్మ్!
Advertisement

AI Shortfilm: ఆదివాసీల పోరాట నినాదమైన జల్, జంగిల్, జమీన్ పేరుతో.. అంటే JJJ టైటిల్‌తో.. 27 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన టీచర్ తొడసం కైలాష్.. ఆయన కుమారుడు బి.టెక్ విద్యార్థి సృజన్ కలిసి ఈ ప్రయోగం చేశారు. ఆదివాసీ ఆరాధ్యదైవం కొమురం భీమ్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలు, పర్యావరణ పరిరక్షణ సందేశంతో ఈ చిత్రాన్ని మలిచారు.

రామాయణ అనువాదం

సాహిత్యం, మాతృభాష గోండిపై మక్కువ ఉన్న కైలాష్.. మహాభారతాన్ని ఇప్పటికే గోండి భాషలోకి అనువదించగా, రామాయణ అనువాదం కొనసాగిస్తున్నారు. తండ్రి రాసిన ఈ ఇతిహాస ఘట్టాలకు.. కుమారుడు సృజన్ తనకున్న ఏఐ నైపుణ్యంతో దృశ్య రూపం ఇచ్చాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు పూర్తి స్థాయి JJJ షార్ట్ ఫిల్మ్‌ను మలిచారు. తండ్రి కథ, సంభాషణలు, పాటలు అందిస్తే.. సృజన్ ఏఐ టూల్స్ ద్వారా సీన్స్ డిజైన్ చేశాడు.

Advertisement

Also Read: ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

షార్ట్ ఫిల్మ్‌ను విడుదల..

ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఈ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, నటులు లేకుండా కేవలం టెక్నాలజీతో మాతృభాషలో ఇంత గొప్ప చిత్రాన్ని తీయడంపై.. కలెక్టర్‌తో పాటు స్థానికులు వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదివాసీల ఘన చరిత్రను నేటి తరానికి అందించాలనే సంకల్పంతోనే ఇది చేశామని, ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తామని వారు చెబుతున్నారు. ఆదివాసీ యువత అత్యాధునిక సాంకేతికతను మాతృభాషా పురోగతికి వాడుతుండటం నిజంగా అభినందనీయం.

Advertisement

Also read: నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×