BigTV English

Kuberaa Day 1Collections : ధనుష్‌కు భంగపాటు.. కుబేరకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు..

Kuberaa Day 1Collections : ధనుష్‌కు భంగపాటు.. కుబేరకు ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు..

Kuberaa Day 1Collections : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ చిత్రం కుబేర.. టాలీవుడ్ స్టార్  దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే జూన్ 20న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. దాంతో రెండో రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్..

శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం జనాల్లో  ఉంటుంది. మెసేజ్ ని అందించే విధంగా ఆయన ప్రతి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన సినిమా కుబేర.. టీజర్స్, ట్రైలర్స్ ఈ మూవీ పై భారీ అంచనాలని క్రియేట్ చేశాయి. అదేవిధంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగానే వచ్చుంటాయని అందరూ అనుకున్నారు. కొన్నిచోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వగా.. మరికొన్ని చోట్ల 60 శాతం ఆక్యుపెన్సి కూడా కాలేదని సమాచారం.. ఏది ఏమైనా కూడా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 12.4 కోట్లు వసూల్ చేసింది.. మొదటి షో తో మంచి టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం తక్కువగానే రావడంతో చిత్ర యూనిట్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ వీకెండ్ కుబేర కలెక్షన్స్ పెరుగుతాయనే ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.


Also Read : చిరు మూవీ నుంచి నయనతార అవుట్… దీపికా పదుకొనె ను ఫాలో అవుతుందా?

కుబేర బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్..? 

కుబేర మూవీ బడ్జెట్ విషయానికొస్తే.. ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. టాప్ టెక్నీషియన్లు వర్క్ చేయడం, రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఇక బిజినెస్ ను చూస్తే.. నాన్ థియేట్రికల్ ద్వారా రూ.65 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.. ఇక మిగితా స్టేట్స్, ఓవర్సీస్ కలిపి రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఈ చిత్రం లాభాల్లో కి రావాలంటే మాత్రం రూ.60 కోట్ల వరకు ఇండియా షేర్, రూ.120 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది. అయితే తెలుగు స్టేట్స్ తో పాటుగా ఓవర్సీస్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. ఇక కలెక్షన్స్ పెరుగుతామే చూద్దాం..

Related News

Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?

Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అకౌంట్ లోకి మరో బిగ్ బ్రాండ్..

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Big Stories

×