Kukoons Movie:ఈ మధ్య చిన్నసినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తుండటంతో అదే బాటలో మరిన్ని సినిమాలిపుడు వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. అదే క్రమంలో వస్తున్న మరో చిన్న సినిమా ‘కుకూన్స్’. జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తాజాగా ఘనంగా పోస్టర్ ని లాంచ్ చేసుకుంది.
ఇక ఈ పోస్టర్ లాంచ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా జరగడం విశేషం.సినిమా విషయానికి వస్తే ..న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి కలిసి ఈ సినిమాను నిర్మించగా మహేశ్ గౌరి దర్శకత్వం వహించారు.
టీమ్ ని మెచ్చుకున్న హిట్ మెషిన్
తాజాగా విడుదలైన ‘కుకూన్స్’ పోస్టర్ విషయానికి వస్తే.. ఈ పోస్టర్‌ను చూసిన అనిల్ రావిపూడి మూవీ టీమ్ ని మెచ్చుకుంటూ ‘కుకూన్స్’ సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. పోస్టర్‌లో కొత్తదనం కనిపిస్తోందని, దర్శకుడు మహేశ్ గౌరి ఆలోచనా విధానం కూడా ఇందులో కనిపిస్తోందని అన్నారు. సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉందంటూ చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
‘డ్రామా జూనియర్స్’ కి మెంటార్‌గా పనిచేసిన వికాస్
ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వికాస్ చైతన్య గురించి కూడా అనిల్ రావిపూడి ప్రత్యేకంగా చెప్పడం విశేషం.గతంలో ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి మెంటార్‌గా పనిచేసిన వికాస్.. ఇప్పుడు ‘కుకూన్స్’ సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిపారు. జగన్, సాగర్, వికాస్‌తో పాటు సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.
‘కుకూన్స్’లో జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్యలతో పాటు సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త నటీనటులతో వస్తున్న సినిమా కావడంతో కథ, పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో కనిపిస్తుంది.
ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
సినిమా నిర్మాణంలో టెక్నికల్ టీమ్ కూడా కీలకంగా పనిచేస్తోంది. ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీశైలం, ఎడిటర్‌గా ఆదిత్య తివారి, డీవోపీగా నిఖిల్ శ్యామ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంగీతాన్ని బి.ఎన్. ఆదిత్య అందిస్తున్నారు. కథకు, పాత్రలకు తగ్గట్టుగా విజువల్స్, మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
also read :సుమలతకు ఫెడరేషన్‌లో నో ఎంట్రీ.. ఛాంబర్ దగ్గర రచ్చ రచ్చ!
ప్రస్తుతం ‘కుకూన్స్’ టీమ్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై త్వరలో మరో ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్దమవుతుంది మూవీ టీమ్. చూడాలి మరి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని వస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !