E-Paper
Advertisement

సుమలతకు ఫెడరేషన్‌లో నో ఎంట్రీ.. ఛాంబర్ దగ్గర రచ్చ రచ్చ!

సుమలతకు ఫెడరేషన్‌లో నో ఎంట్రీ.. ఛాంబర్ దగ్గర రచ్చ రచ్చ!
Advertisement

Dancers Association Dispute:డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో మొదలైన మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించట్లేదు.తాజాగా ఫెడరేషన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సహాయ నిరాకరణ చేస్తున్నామంటూ లేక వదలడం తో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.ఇక ఇదే క్రమంలో తాజాగా ఫెడరేషన్ మీటింగ్ కి సుమలతను అనుమతించకపోవడంతో ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నానా రబస జరిగిపోయింది.

రెండు వర్గాల మధ్య గొడవ

Advertisement

ఈ సందర్భంగా ఫెడరేషన్ మీటింగ్‌కు తనను ఎందుకు అనుమతించడం లేదంటూ సుమలత ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది.ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా ఉన్న తనను సమావేశానికి పిలిచి కూడా లోపలికి అనుమతించకపోవడం ఏంటి అంటూ మండిపడింది.దీంతో ఆ వాగ్వాదం కాస్తా వివాదంగా మారి ఛాంబర్ బయట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అయితే ఈ గొడవ ఇప్పుడే మొదలైంది కాదు.నాలుగు నెలల క్రితం డాన్సర్స్ అసోసియేషన్‌లో జానీ మాస్టర్ ,శేఖర్ మాస్టర్ ల వర్గాల మధ్య మొదలైన పంచాయితీ క్రమంగా డాన్సర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా ఉన్న సుమలత వర్గానికి, మరో వర్గానికి మధ్య వివాదానికి దారి తీయడంతో అది కాస్తా ఫెడరేషన్ వరకు వెళ్ళింది.

Advertisement

ఫెడరేషన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడతాం 

ఈ క్రమంలోనే గతంలో సుమలత, జానీ మాస్టర్‌తో ఫెడరేషన్ పెద్దలు సమావేశమవడం,ఫెడరేషన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, డాన్సర్స్ యూనియన్‌లో కొన్ని పదవులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తామని ఇద్దరూ చెప్పినట్లు ఫెడరేషన్ వర్గాల నుండి వినిపిస్తుంది.ఇందులో భాగంగా ఒక లేఖపై సంతకాలు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది.

కానీ ఆ తర్వాత జరిగిన సమావేశంలో పరిస్థితి మారిపోయిందని, అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలని సుమలత వర్గం పట్టుబట్టిందని ఫెడరేషన్ వారి వాదన. దీంతో సమావేశంలో మరోసారి మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. చివరకు ఫెడరేషన్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

అనిల్ కుమార్ కొనసాగేందుకు అర్హత ఏమిటి

ఇక ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 23న జరిగిన ఫెడరేషన్ సమావేశం లో 225 మంది డ్యాన్సర్లు అటెండ్ అయ్యరని, వారిలో 214 మంది రఘు మాస్టర్‌కు మద్దతు తెలిపారని, 11 మంది సుమలతకు మద్దతుగా నిలిచారని ఫెడరేషన్ వర్గాల మాట.

దీంతో సుమలత ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఇక కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎలక్షన్స్ నిర్వహిస్తామని అనౌన్స్ చేశారు కూడా. దీంతో అసలు డాన్స్ యూనియన్ కి ఎలక్షన్స్ పెట్టె అధికారం ఎవరిచ్చారు ?ప్రెసిడెంట్ గా వల్లబనేని అనిల్ కుమార్ కొనసాగేందుకు అర్హత ఏమిటి అంటూ వాయిస్ రైజ్ చేస్తుంది సుమలత.

also read :జెట్లీ దెబ్బకు మైండ్ బ్లాంక్.. గోల్డెన్ భాగ్యంతో సత్య సీన్ మారుతుందా?

ఇప్పుడు తాజాగా ఫెడరేషన్ మీటింగ్ దగ్గర జరిగిన గొడవతో డాన్సర్స్ అసోసియేషన్ పంచాయితీ మరోసారి రోడ్డెక్కింది. మరి ఈ పరిస్థితులలో అక్టోబర్ 11న ఎన్నికలు సాఫీగా సాగుతాయా ?ముందు ముందు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుంది అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

 

Tags

Related News

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

సుడిగాలి సుధీర్ ‘గోట్’కు మరో రిలీజ్ డేట్.. ఈసారి ఏమవుతుందో?

కుకూన్స్ పోస్టర్ చూశారా? అనిల్ రావిపూడి కూడా ఫిదా!

జెట్లీ దెబ్బకు మైండ్ బ్లాంక్.. గోల్డెన్ భాగ్యంతో సత్య సీన్ మారుతుందా?

బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !

జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!

Big Stories

Advertisement
×