E-Paper
Advertisement

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. రైతు రుణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు!

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. రైతు రుణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు!
Advertisement

Maharashtra Drought: మహారాష్ట్రలో కరువు పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన కరువు సహాయ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. రైతుల రుణాల వసూళ్లపై చర్చించారు. కరువు పరిస్థితుల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని బ్యాంకులు, సహకార సంఘాలకు సూచించారు. రుణాల రికవరీ కోసం రైతుల ఇళ్లకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు రుణ వసూళ్ల నిలిపివేతపై ఆర్బీఐ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

ట్రిగ్గర్-1 అమలు..

మహారాష్ట్రలో మొత్తం 358 తాలూకాల్లో 265 తాలూకాలను ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. అంటే రాష్ట్రంలోని దాదాపు 74 శాతం ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు గుర్తించింది. కరువు నిర్వహణ నిబంధనల ప్రకారం ట్రిగ్గర్-1 అమలు చేసింది. వర్షపాతం 25 శాతానికి పైగా తగ్గడం, 21 రోజుల పాటు పొడి వాతావరణం ఉండటంతో ఈ దశను ప్రకటించారు. మరో 43 తాలూకాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

10 శాతం నీటి కోత..

Advertisement

ఇక తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతం నీటి కోత అమలు చేయాలని.. వచ్చే ఏడాది జూన్ వరకు నీటి నిల్వలను కాపాడుకోవాలని ఆదేశించింది.

Also read: అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

Tags

Related News

ఖమ్మంలో రూ. 34 లక్షల ఎక్సైజ్ శాఖ కొత్త భవనం.. ప్రారంభానికి ముందే పగుళ్లు!

దేశంలో 13 శాతం వర్షపాతం లోటు.. ఆహార భద్రతపై నిపుణులు ఆందోళన!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

నామినేటెడ్ పదవుల ఎంపికలో సీఎం రేవంత్ సంచలనం.. వారికే పెద్దపేట?

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

Big Stories

Advertisement
×