E-Paper
Advertisement

Sukumar: సుకుమార్ లోని టాలెంట్ ను అప్పుడే గుర్తించిన దిగ్గజ నటుడు

Sukumar: సుకుమార్ లోని టాలెంట్ ను అప్పుడే గుర్తించిన దిగ్గజ నటుడు
Advertisement

Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది తమ ప్రయాణాన్ని ఎక్కడో మొదలుపెట్టి ఏదో ఒక స్థాయికి వెళ్ళారు. ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా నిలబడుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఆ ప్రస్తావన తీసుకొస్తే సుకుమార్ ప్రయాణం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దిల్ సినిమాకి రచయితగా పనిచేశాడు దర్శకుడు సుకుమార్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన లై సినిమాకి అదే సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. సుకుమార్ ప్రయాణం ఏ లెవెల్ లో ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

కొన్ని సినిమాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్లు పేర్లు చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయా సినిమాలకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. సుకుమార్ విషయానికి వస్తే రచయితగా తన కెరీయర్ని స్టార్ట్ చేసి చాలామందిని అప్పట్లోనే ఆశ్చర్యపరిచాడు. ఆర్య సినిమా కూడా డైరెక్షన్ కంటే కూడా రైటింగ్ ఎక్కువ ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

Advertisement

సుకుమార్ లోని దర్శకుడిని అప్పుడే గుర్తించాడు

నటుడు రచయిత ఎల్.బి శ్రీరామ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నారు ఎల్బీ శ్రీరామ్. ఆయన నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా ఏ స్థాయి హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాని రీసెంట్ గా కూడా రీ రిలీజ్ కి సిద్ధం చేశారు. ఆ సినిమాకి రైటర్ గా పని చేశారు సుకుమార్. దానిలో ఆవు సీను ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే దానిలో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది అంట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఎల్బీ శ్రీరామ్ తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ప్రకాష్ రాజ్ కూడా గుర్తించారు

ప్రకాష్ రాజు దర్శకత్వం వహించిన మా ఊరి రామాయణం సినిమా ఈవెంట్ కు సుకుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పుడు సుకుమార్ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ నా సినిమాల్లో పెద్ద నటులను ఎప్పుడూ పెట్టుకోను, ఎందుకంటే నాకు భయం అని చెప్పుకొచ్చారు. అయితే ఒక సందర్భంలో మాత్రం “క్షేమంగా వెళ్లి లాభంగా రండి” అనే సినిమాకు నేను రచయితగా పనిచేశాను. ఆ టైంలో ఒక డైలాగ్ చదివి ప్రకాష్ రాజ్ ఈ డైలాగ్ రాసింది ఎవరు అని పిలిచి నన్ను ప్రోత్సహించారు అంటూ సుకుమార్ తెలిపారు. ఒక దర్శకుడుగా టాలెంట్ బయటపడిన తర్వాత చాలామంది గుర్తిస్తారు. కానీ దర్శకుడు అవ్వకముందే కొంతమంది నటులతో పనిచేయటం వలన వాళ్లకు కొంతమంది ఏ స్థాయికి వెళ్తారో అర్థం అవుతుంది. అలాంటి వారిలో సుకుమార్ ఒకరు.

Also Read : Actor RK Sagar : వాళ్లు నన్ను మోసం చేశారు, సెకండ్ లీడ్ అని చెప్పి నా కెరియర్ అలా చేశారు

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×