Influencer Archita Phukan: అర్చితా ఫుకాన్. యువతకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అస్సామీ ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెద్దాళ్ల సినిమాల్లోనూ నటిస్తోంది. కానీ, అర్చితా జీవితంలో మరో చీకటి కోణం ఉంది. పడుపు వృత్తిలో మగ్గిన రోజులూ ఉన్నాయి. ఆమె ఓ సంస్థ సాయంతో ఆ చీకటి ప్రపంచం నుంచి బయటపడింది. తను మాత్రమే కాదు, తనతో పాటు మరో 8 మందిని ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
బోల్డ్ కంటెంట్ తో మంచి గుర్తింపు
ఆన్ లైన్ లో బేబీ డాల్ ఆర్చిగా గుర్తింపు తెచ్చుకుంది అర్చితా ఫుకాన్. ఈ అమ్మడు అమెరికన్ అడల్ట్ స్టార్ కేంద్రా లస్ట్ తో కలిసి పని చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఫుకాన్, బోల్డ్ కంటెంట్ తో బాగా ప్రసిద్ధి చెందింది. కేంద్రా లస్ట్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా ఆమె ఇటీవల నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఇద్దరూ తరచుగా ఒకరినొకరు పోస్ట్ లలో ట్యాగ్ చేసుకుంటున్నారు. వీళ్లిద్దరు ఏదో ప్రాజెక్టులో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. 25 లక్షలు చెల్లించి మరీ పడుపు వృత్తి నుంచి బయటకు..
ప్రస్తుతం గ్లామరస్ రీల్స్, ఫోటోలు షేర్ చేస్తున్న అర్చిత ఫుకాన్.. జూలై 2023లో షేర్ చేసిన పోస్ట్‌లో తన బాధాకరమైన జీవితాన్ని గురించి వివరించింది. ఒకప్పుడు పడుపు వృత్తిలో చిక్కుకున్నట్లు వెల్లడించింది. అందులో నుంచి బయట పడేందుకు రూ. 25 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. వ్యభిచారం అనే చీకటి ప్రపంచంలో చిక్కుకున్న ఆరు సంవత్సరాల తర్వాత, దాని నుంచి బయటపడినట్లు చెప్పింది. దాని నుంచి స్వేచ్ఛను పొందేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు అర్చిత వెల్లడించింది. అదే పోస్టులో ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ లైట్ ఏరియా అయిన GB రోడ్ ను ట్యాగ్ చేసింది.
మరో 8 మందిని కాపాడిన ఫుకాన్!
ఫుకాన్ పడుపు వృత్తి నుంచి ఎలా బయటపడింది? ఆ డబ్బులు ఎవరికి చెల్లించాల్సి వచ్చింది? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. “నా బాధాకరమైన గతాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు, ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా నిలబడ్డాను. ఆశ, ఆత్మ శక్తి చీకటి పరిస్థితులపై కూడా విజయం సాధించగలవని రుజువు చేస్తుంది. ఒక స్నేహితురాలు, ఒక సామాజిక సంస్థ సపోర్టుతో ఇలాంటి పరిస్థితుల నుంచి మరో ఎనిమిది మంది బాలికలను రక్షించడంలో సాయం చేయగలిగాను” అని రాసుకొచ్చింది. ఈ పని చేయడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని అర్చిత ఫుకాన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడల్ట్ కంటెంట్ తో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు అడల్డ్ కంటెంట్ చేసిన సన్నీ లియోన్.. ఆ తర్వాత సినిమా స్టార్ గా మారినట్లుగానే, ఫుకాన్ కూడా సినిమాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటుంది.
Read Also: ఆ గ్రామంలో కాలనీలన్నీ గుండ్రంగా ఉంటాయి.. మీరూ అక్కడ స్టే చేయొచ్చు!