HYDRA: దారికి అడ్డుగా ఉన్న ఓ పెద్ద గోడ వేలాది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆ గోడ వల్ల వేల మంది ప్రజలు నిత్యం 5 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించిన పరిస్థితి నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ప్రగతినగర్ కు చేరుకునేందుకు ప్రజలు నానా తంటాలు పడేవారు. మరి కొంత మంది తమది గేటెడ్ కమ్యూనిటీ తమ కాలనీలో నుంచి రాకపోకలు బంద్ అంని అడ్డుగోడలు కట్టేవారు ఉన్నారు. ఇదంతా మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట, బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న వివాదం.
దాదాపు 25,000 మంది ప్రజల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న గోడను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇటీవల కూల్చివేసింది. ఈ సంఘటన మల్లంపేట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ ద్వారా ప్రగతి నగర్‌కు వెళ్ళే మార్గంలో జరిగింది. ఈ మార్గం సాధారణంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రణీత్ ఏపీఆర్ ప్రణవ్ అంటీలియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మించిన గోడ కారణంగా ఈ దూరం 8 కిలోమీటర్లకు పెరిగింది. ఈ గోడ వల్ల చాలా రోజుల నుంచి పది కాలనీల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లంపేట్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేసి, ఈ గోడను తొలగిస్తే 40 నుంచి 60 అడుగుల వెడెల్పు గల రహదారి మళ్లీ ఉపయోగంలోకి వస్తుందని విన్నవించారు. హైడ్రా అధికారులు ఈ ఫిర్యాదును పరిశీలించి, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌యూడీఏ) ఆమోదించిన లేఅవుట్ ప్రకారం ఈ ప్రాంతం గేటెడ్ కమ్యూనిటీ కాదని గుర్తించారు. హెచ్ఎండీఏ నిబంధన 7 ప్రకారం, రహదారులను అడ్డుకునేలా గోడలు నిర్మించకూడదని స్పష్టంగా ఉంది. దీంతో హైడ్రా ఈ గోడను కూల్చివేసి, రహదారిని పునరుద్ధరించింది.
ALSO READ: Heavy rains: బిగ్ రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో అతి భారీ వర్షం.. ఈ మూడు రోజులు జాగ్రత్త
దీని ఫలితంగా, బాచుపల్లి-మల్లంపేట్ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద ఇటీవల తెరిచిన ఎగ్జిట్ వద్ద హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ చర్యను పర్యవేక్షించారు. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని హెచ్చరించారు. ఈ గోడను కూల్చివేయడం వల్ల దాదాపు 25,000 మందికి పైగా ప్రయోజనం చేకూర్చింది.
ALSO READ: C-DAC recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్
బుద్ధ భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రాకు రోడ్లు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 49 ఫిర్యాదులు అందాయి. గాజులరామారం, చెంగిచెర్ల, కొత్తగూడ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రాకు ఈ ఫిర్యాదులను పరిశీలించి, చట్టవిరుద్ధ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే కాక, పటిష్టమైన పట్టణాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.