E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 14th: ఉదయం మీనా చింతామణి భర్త అయినా సింగరాజు దగ్గరికి వెళ్లి నాకు ఒక ఆర్డర్ వచ్చింది. నాకు మీరు డబ్బులు ఇస్తే ఆ ఆర్డర్ ని పూర్తి చేసే మీకు వెంటనే డబ్బులు ఇస్తాను అని అడుగుతుంది.. నాకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీతో డీల్ కుదిరిందండి. అది కచ్చితంగా నేనే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు ఏ టైంలో అయినా డబ్బులకి రమ్మని అన్నారు కదా..అందుకే నేను వచ్చాను అని అంటుంది. ఈ పోటీలో చింతామణి కూడా ఉంది అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సింగరాజు. పోటీలో చింతామణి ఉంది కాబట్టి నువ్వు తప్పుకోవడమే బెటర్ అమ్మ ఈ ఆర్డర్ నీకు రాదు అంటాడు. ఆ మాట వినగానే మీనా ఫ్యుజులు ఎగిరిపోతాయి.. ఇస్తానని మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చాను అంతేకానీ ఇలా మీరు అంటారని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది మీనా.. నేను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా అని సింగరాజు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం అస్సలు వినదు..

బాలుకు నిజం చెప్పిన మీనా..

బాలు మీనా డబ్బుల కోసం ప్రయత్నిస్తుందని తెలుసుకున్న విషయం తెలిసిందే నేను సింగరాజు దగ్గరికి వెళ్లి అక్కడ డబ్బులు కోసం అడిగిన విషయాన్ని బాలుకి చెప్పేస్తుంది.. బాలు ఎంతగా ప్రయత్నించినా సరే మనకి డబ్బులు రావడం లేదు ఏదో ఒకటి చేద్దాం లే మీనా నువ్వు ఏమి కంగారు పడకు అని అంటాడు. అయితే మీనా మాత్రం అంత ధైర్యంగా ఉండలేక పోతుంది. మనకి డబ్బులు రావడం లేదండి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని తెగ బాధ పడిపోతుంది. నువ్వేమీ బాధపడకపోయినా ఏదో ఒకటి చేద్దాం ఎలాగైనా సరే యాడ్ నీకే వస్తుంది అని బాలు చాలా సంతోషంగా చెప్తాడు కానీ మీనా మాత్రం అంత ధైర్యంగా ఉండలేకపోతోంది.. నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేసి వస్తానండి అని చెప్తుంది..

బాలుకు అర్జున్ దిమ్మతిరిగే ఝలక్..

Advertisement

బాలు అక్కడ నిల్చనే ఉండగా ఓ వ్యక్తి వచ్చి మమ్మల్ని గుడికి తీసుకొని వెళ్ళాలి వెళ్తావా అని అడుగుతాడు. ఎందుకు వెళ్ళాను సార్ తీసుకొని వెళ్తాను అని అంటాడు. కానీ అతను కారుని అలాగే మనిషిని చెక్ చేయడం చూసి బాలు కాస్త వెరైటీ మనిషి అని అనుకుంటాడు.. నువ్వు తాగలేదు కదా అలాగే మాంసం కూడా తినలేదు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాలుని విసిగిస్తాడు కానీ బాలు మాత్రం నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్ నాలుగు ఇడ్లీలు మాత్రమే తిన్నాను అని అంటాడు. ఇక కారు ఎక్కి పోతుండగా ఒకచోట అరుణ్ బాలు కారుని ఆపుతాడు.. కస్టమర్ ముందే బాలుని అవమానించాల మాట్లాడడంతో చాలా ఫీల్ అవుతాడు. నేను తాగలేదు నీ అంత చెప్పినా సరే మీరు మాత్రం అసలు వినడం లేదు అని అంటాడు కానీ కస్టమర్లు అరుణ్ చెప్పిన మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు..

బాలుతో అరుణ్ గొడవ..

బాలు నా కష్టమని నాకు కాకుండా చేశారు నేను తాగలేదని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా నన్ను అవమానించారు అని తెగ బాధ పడిపోతూ ఉంటాడు. అయితే బాలు ఊదమనే ఎంత అడుగుతున్నా సరే నేను అసలు ఊదును అని అంటాడు. అయితే నేను కేసు రాస్తాను అని అరుణ్ బాలుతో గొడవ పడతాడు.. ఆ తర్వాత బాలు వేరే కానిస్టేబుల్ వచ్చి ఒక్కసారి ఊదుమని అడుగుతాడు రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి నేను ఊదుతాను అని అంటాడు.. తాగలేదని చూపిస్తుంది సార్ అని అనగానే బాలు నేను తాగకపోయినా నన్ను అవమానించాలని కస్టమర్లను వెళ్ళగొట్టారు.. నాకు నష్టం జరిగిన చేశారు ఆ డబ్బులు మీరే ఇస్తారని గొడవకు దిగుతాడు. కానీ బాలు మాత్రం ఎలాగైనా ఒకసారి తాగి అరుణ్ కి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.

మీనా కోసం సుమతి..

Advertisement

మీనా ఇక తన పుట్టింటికి వెళ్లి ఈ విషయాన్ని తన తల్లితో చెప్తుంది. కష్టాలు మనకి ఎప్పుడూ వెంటనే ఉంటాయి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అమ్మ నేను బాధ పడిపోతూ ఉంటుంది. మరి ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఏం చేస్తావు అని పార్వతి అడుగుతుండగా అప్పుడు అక్కడికి వచ్చిన సుమతి ఏం జరిగింది..? ఎందుకు మీరు ఇద్దరు బాధపడిపోతున్నారు అని అడుగుతుంది. ఒక పెద్ద ఆర్డర్ అక్కకు వచ్చిందంట కానీ ఐదు లక్షలు కట్టాలంట దాని గురించే అక్క బాధపడిపోతుంది అని చెప్పగానే దానికి ఎందుకు మీరు అంతగా బాధపడిపోతున్నారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను ఇస్తాను అని ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం అవి నీ పెళ్లి కోసం దాల్చిన డబ్బులు నాకు ఒకవేళ దొరక్కపోతే నీ దగ్గర తీసుకుంటాను అని అంటుంది.. అక్కచెల్లెళ్ల ప్రేమగా ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

మందు తాగిన బాలు..

అరుణ్ నన్ను అవమనించాడు అని బార్ కెళ్ళి మందు తాగుతాడు.. రాజేష్ అక్కడికి వచ్చి నువ్వు మందు మానేసావ్ కదరా మల్లి ఇదేంటి కొత్తగా అని అడుగుతాడు.. అరుణ్ కి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇవ్వాలి అని బాలు అనుకుంటాడు.. ఇక అరుణ్ ఎక్కడుంటే అక్కడికి పోనివ్వరా అని రాజేష్ అంటాడు. ఇక బాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మొత్తానికి బాలుని రాజేష్ అరున్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అక్కడ అతని చూసి కూడా పెట్టుకోవడానికి వచ్చావా అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనా బాలు తో గొడవ పడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

Big Stories

Advertisement
×