Dhee:బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ డాన్స్ షో ఢీ (Dhee) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఢీ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ షో ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. యాంకర్లు మారినా, జడ్జెస్ మారినా ఢీ షోలోకి వచ్చే కంటెస్టెంట్ల డ్యాన్స్కి మాత్రం క్రేజ్ తగ్గదు. ఎప్పటికప్పుడు కొత్త కంటెస్టెంట్లు వస్తూ షోలో అలరిస్తూనే ఉంటారు. ఈ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఫేమస్ అయ్యి చాలామంది పెద్ద హీరోల సినిమాలకు వర్క్ చేస్తున్నారు కూడా. అలాగే చాలామంది డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ షోలో డాన్సర్లుగా చేసిన వాళ్ళు ఎంతోమంది నెక్స్ట్ సీజన్ కి కొరియోగ్రాఫర్లుగా మారి తమ సత్తా ఏంటో చాటుతున్నారు.
ఢీ షో ప్రోమో వైరల్..
అయితే అలాంటి ఢీ షోకి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చేసిన ఒక హాట్ డాన్స్ చూసి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి ఇంతకీ ఆ అమ్మాయిల డాన్స్ లో విమర్శలు వచ్చేంత తప్పు ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మాయిల పర్ఫామెన్స్ పై విమర్శలు..
ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే ఢీ షోకి యాంకర్ గా గీత మాధురి భర్త నందు (Nandu) చేస్తున్నారు. అలాగే జడ్జెస్ గా హీరోయిన్ రెజీనా (Regina) , విజయ్ బిన్నీ మాస్టర్(vijay Binni) లు ఉన్నారు.అయితే ఢీ షోకి సంబంధించి తాజాగా ఒక ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆ ప్రోమోలో ఇద్దరు అమ్మాయిలు చాలా హాట్ గా డాన్స్ చేస్తున్నారు.. రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే సినిమాలోని “రా రాకుమారా రాజసానా ఏలగా” అనే రొమాంటిక్ పాటలో ఈ ఇద్దరు అమ్మాయిలు అదరగొట్టేసారు.
పంచ్ లతో రెచ్చిపోయిన టీమ్..
ఇలాంటి రొమాంటిక్ పాటలో మామూలుగా అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేస్తారు.కానీ ఈ పాటలో మాత్రం ఇద్దరు అమ్మాయిలు తమ హాట్ పర్ఫామెన్స్ తో ఢీ ఫ్లాట్ ఫామ్ ని షేక్ చేశారు. వీళ్ళు డాన్స్ చేసినంత సేపు హైపర్ ఆది(Hyper Adi), బిన్నీ మాస్టర్, యాంకర్ నందులు వారిని అలాగే కన్నార్పకుండా చూశారు. వీరి డాన్స్ షో అయిపోయాక రెజీనా ఇద్దరమ్మాయిలని పొగుడుతూ.. చాలా హాట్ డాన్స్ అంటూ మెచ్చుకుంది. నందు నువ్వు కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నావు అని రెజీనా అడగగా.. ఊరికే సరదాగా పెట్టుకున్నానని నందు అంటే మేము ఇంద్ర సినిమాలో ఓ సీన్ చేస్తున్నావ్.నీకు నీకు నీకు నాకు అని హైపర్ ఆది అనగా.. బిన్ని మాస్టర్ వెంటనే మరి నాకు అంటూ పంచ్ వేశారు. మాస్టర్ మాటలకి హైపర్ ఆది తనదైన స్టైల్ లో పంచ్ వేస్తూ ఇదయ్యా నీ అసలు రూపం అంటూ దండం పెడతాడు.
ఫ్యామిలీలు చూస్తున్నారు అంటూ ఫైర్..
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ఇద్దరమ్మాయిల డాన్స్ చూసిన నెటిజన్లు అసలు మీరు ఆడవాళ్లేనా.. ఇలా ఎలా డాన్స్ చేయగలరు.. ఢీ షోని చాలామంది ఫ్యామిలీస్ ఒకే దగ్గర కూర్చొని చూస్తారు. అలాంటిది మీరు చేసే పర్ఫామెన్స్ ని ఫ్యామిలీ లో ఉండేవాళ్ళు అందరూ కలిసి చూస్తారని తెలిసి కూడా ఇలాంటి హాట్ ఫోజులు పెట్టి చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ షోలో సుస్మిత అలాగే మరో కంటెస్టెంట్ ఇద్దరు కలిసి చేసిన ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ పూర్తిగా చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ALSO READ:Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?
?utm_source=ig_web_copy_link