Arunachal pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. పశ్చిమ కామెంగ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో వాహనాలు భారీగా వెళ్తున్నాయి. వాటి నుంచి కొన్నివాహనాలు తప్పించుకున్నాయి. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. అసలేం జరిగింది?
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్-దిరాంగ్ మధ్య కామెంగ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిరాంగ్ సబ్ డివిజన్‌లోని సప్పర్ క్యాంప్ ప్రాంతంలో కొండ చరియల ఘనటతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక పత్రికలు వెల్లడించాయి.
కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఓ వీడియోలో కొండలపై నుండి బండ రాళ్లు దొర్లుతున్నట్లు కనిపించాయి. ఆ సమయంలో వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వాహనదారులు తమ వాహనాలను వెనక్కి తిప్పి హారన్ మోగించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 120 మీటర్ల మేరా రోడ్డు మూసుకుపోయిందని కథనాలు వెలువడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటుంది. ఈ ఘటన తర్వాత పౌర-సైనిక కదలికలకు కాస్త ఇబ్బందిగా మారిందని చెబుతున్నాయి.
ALSO READ: ఫుడ్ ఇవ్వడానికి మహిళ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత ఏం జరిగింది?
భలుక్‌పాంగ్-చరిదువార్-తవాంగ్ హైవే పూర్తిగా మూసివేశారు. తవాంగ్ నుండి తేజ్‌పూర్‌కు వెళ్లే వాహనాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బండరాళ్లు పడుతున్న సమయంలో జిప్సీ-బొలెరో వాహనాలు ఢీ కొన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇవాళ కొండ చరియలు విరగకుండ ఉంటే బుధవారం నుండి రాకపోకలు తిరిగి ప్రారంభించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
మంగళవారం ట్రాఫిక్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది. మరోవైపు ఆగస్టు 28 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెవెన్ సిస్టర్ స్టేట్స్‌ని ఇటీవల కాలంలో కొండచరియలు ఘటనలు వెంటాడుతున్నాయి.
భారీ వర్గాల కారణంగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బండరాళ్లు పడుతున్నాయి. ఇలాంటి ఘటన సోమవారం నాగాలాండ్‌లో చోటు చేసుకుంది. రాజధాని కోహిమా-వోఖా పట్టణం మధ్య NH-2 వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల అనేక జిల్లాలను కలిపే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కొండ పైనుంచి దొర్లుకుంటూ వచ్చి వాహనాలపై పడిన బండరాళ్లు.. వీడియో
అరుణాచల్‌ప్రదేశ్ పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో ఘటన
కొండచరియలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసం
వాహనదారులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రాణనష్టం
కొండచరియలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య… pic.twitter.com/lCy9OyUxCk
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025