BigTV English

Madharaasi : అదరగొట్టిన అనిరుద్ రవిచంద్రన్, అంతే పోటీగా శేఖర్ మాస్టర్

Madharaasi : అదరగొట్టిన అనిరుద్ రవిచంద్రన్, అంతే పోటీగా శేఖర్ మాస్టర్

Madharaasi : ప్రస్తుతం కొంతకాలంగా మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు ఏవి పెద్దగా వినిపించడం లేదు. ఒక్క అనిరుద్ రవిచంద్రన్ పేరు తప్ప. అనిరుద్ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అవే అంచనాలను పాటలతో మరింత రెట్టింపు చేస్తాడు. ముఖ్యంగా రాబోయే పెద్ద సినిమాల అన్నిటికీ కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.


అనిరుద్ సంగీత అందించిన కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా కథపరంగా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా మ్యూజిక్ పరంగా ఒక కంప్లైంట్ లేదు. అనిరుద్ వలనే సినిమా నిలబడింది అని పొగిడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చివరి నిమిషం వరకు సినిమాను తన మ్యూజిక్ తో నిలబెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఒకవైపు తమిళ్ మరోవైపు తెలుగు సినిమాలతో కంప్లీట్ బిజీగా మారిపోయాడు.

అదరగొట్టిన అనిరుద్ 


ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమా మదారాసి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో శివ కార్తికేయన్ ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అసలు ఈ పాట అనౌన్స్మెంట్ చాలా క్రేజీ వీడియోతో ఇచ్చారు. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో దానిని మించి ఇప్పుడు పాట వైరల్ అవుతుంది. “సలంబల” అనే పాట ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ప్రతిసారి ఇలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. జూన్ మంత్ నుంచి అనిరుద్ వరుసగా అద్భుతమైన సాంగ్స్ వదులుతూనే ఉన్నాడు. ఆ లిస్టులో ఇప్పుడు శివ కార్తికేయన్ సలంబల సాంగ్ కూడా జాయిన్ అయింది.

శేఖర్ మాస్టర్ అసలు తగ్గలేదు 

అనిరుద్ బీట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బీట్ ని సరిగ్గా ఎనర్జీతో మ్యాచ్ చేసే కొరియోగ్రఫీ చేశాడు శేఖర్ మాస్టర్. ముఖ్యంగా శివ కార్తికేయన్ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శివ కార్తికేయన్ అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ పై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఏదేమైనా తెలుగు కొరియోగ్రాఫర్స్ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా డామినేషన్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. ఒకపక్క జానీ మరోపక్క శేఖర్ తెలుగు వాడి సత్తా ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో చూపిస్తున్నారు అనడానికి ఇటువంటి పరిణామాలే నిదర్శనం.

Also Read: Anirudh About Coolie : కూలీ సినిమా టాక్ చెప్పేసిన బక్కోడు, కూలీ ను మించిన పని చేస్తున్నాడు

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×