BigTV English

Mahesh Babu: వివాదంలో ఉన్న సినిమాకు బాబు రివ్యూ.. ఎందుకయ్యా నీకు ఇవన్నీ ..

Mahesh Babu: వివాదంలో ఉన్న సినిమాకు బాబు రివ్యూ.. ఎందుకయ్యా నీకు ఇవన్నీ ..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  గుంటూరు కారం లాంటి ప్లాప్  తర్వాత మహేష్ SSMB 29 సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాపై తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎన్నో అంచనాలను పెట్టుకుంది. ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత రాజమౌళి.. మహేష్ కోసం రెండేళ్లు కథను సిద్ధం చేసి ఈ సినిమాను సెట్స్  మీదకు తీసుకెళ్లాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే  కథతో SSMB 29ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.


 

ఇక  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే మహేష్ కు సినిమా పిచ్చి ఎంత ఉందో అందరికీ తెలిసిందే.  ఖాళీ సమయంలో మంచి మంచి సినిమాలను చూసి వాటి రివ్యూలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.


 

చిన్న సినిమా, పెద్ద సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా, ఇంగ్లీష్ సినిమా, వెబ్ సిరీస్  అనే తేడా లేకుండా తన మనసుకు నచ్చింది అంటే నిర్మొహమాటంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉంటాడు. తాజాగా మహేష్ బాబు.. బాలీవుడ్  మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చాడు. ” సితారే  జమీన్ పర్ సినిమా ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో… అది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది. ఆమీర్ ఖాన్ క్లాసిక్స్ అన్నింటిలాగే, మీరు మీ ముఖంలో పెద్ద చిరునవ్వుతో బయటకు వెళ్తారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

 

గత కొన్ని రోజులుగా ఆమీర్ ఖాన్ పై వరుస ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.  పహల్గామ్ దాడి సమయంలో అమీర్ ఖాన్ స్పందించలేదని హిందువులు అతనిపై విమర్శలు గుప్పించిన విషయంవిదితమే. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలు తాము చూడమని, సితారే  జమీన్ పర్ ను  వెంటనే బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్స్ సృష్టించారు. అంతేకాకుండా ఒక రీమేక్  సినిమా ను ఎన్నిసార్లు చూడాలని ఆమీర్  రీమేక్స్  మాత్రమే చేస్తాడని చెప్పుకొచ్చారు. ఇక వీటిపై  ఆమీర్ స్పందించాడు. తను జీవితాంతం  రీమేక్  సినిమాలు మాత్రమే చేస్తానని ఖరాకండీగా చెప్పుకొచ్చాడు ఇక ఈ మాటలు మరింత వివాదానికి దారితీసాయి.

 

ఇన్ని వివాదాల నేపథ్యంలో ఉన్న ఈ సినిమాకు మహేష్ రివ్యూ ఇవ్వడం మరింత సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ రివ్యూ ఇవ్వకపోతే ఏమవుతుంది మహేష్ అన్న అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు లేనిపోని రిస్క్ ఇందులో అనవసరంగా ఇరుక్కుంటావు అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా లవర్ గా మహేష్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు తప్ప వేరే విషయాలు ఏవి ఆయనకు తెలియదు అని మహేష్ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదంలో మహేష్ ను లాగుతారా అనేది చూడాలి.

 

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×