E-Paper
Advertisement

‘వారణాసి’ బర్త్ డే ట్రీట్ అదుర్స్.. ఏమున్నాడ్రాబాబు మహేష్..

‘వారణాసి’ బర్త్ డే ట్రీట్ అదుర్స్.. ఏమున్నాడ్రాబాబు  మహేష్..
Advertisement

Varanasi Update : దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి.. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా.. ఆస్కార్ లెవెల్ లో అవార్డులను కూడా సొంతం చేసుకోవడంతో, చాలామంది ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురుచూస్తున్నారు.. ఈ మూవీలో మహేష్ బాబు లుక్కు కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఆయన అభిమానులు మా హీరో ని స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకోవాలి అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారణాసి టీం ఈ మూవీ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ ను ఇచ్చింది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక పోస్ట్ అనే రిలీజ్ చేస్తారు.. ఆ పోస్టర్లో మహేష్ బాబు లుక్ అదిరిపోయిందంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి మహేష్ ఆ పోస్టర్లో ఎలా ఉన్నాడో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

‘వారణాసి’ నుంచి మహేష్ బాబు పోస్టర్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబో గా రాబోతున్న వారణాసి చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు అంత డిమాండ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మహేష్ బాబు తో రాజమౌళి ఎలాంటి కథతో సినిమాను దొరికేకిస్తాడు అన్న ఉత్కంఠ జనాలలో ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది.. ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక నదిపై వెదురు బొంగుల దెబ్బ లాంటి దానిపై మహేష్ బాబు పడుకున్నట్లు కనిపిస్తాడు. స్టైలిష్ గా ఉన్న మహేష్ ను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.. ఈ మూవీ ఆస్కార్ లెవెల్ కి వెళ్తుంది అంటూ ఆయన అభిమానులు బర్త్డే విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.. అతనికి ఇవాళ రిలీజ్ అయిన పోస్టర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది..

Advertisement

వారణాసి మూవీ..

రాజమౌళి సినిమా కోసం ఎంత డెడికేషన్ గా పనిచేస్తాడు అందరికీ తెలుసు. ఆయన ఇప్పటివరకు స్టార్ హీరోలతో చేసిన ప్రతి సినిమా మంచి పర్ఫెక్షన్ తో ఉండడంతో పాటుగా.. అందులో ఉండే కథ కూడా జనాలని విపరీతంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కథతోనే రాబోతుంది ఈ వారణాసి చిత్రం. గతంలో ఎన్నడు కనిపించని విధంగా మహేష్ బాబు లుక్  ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించడంతో అభిమానులు సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి.. ఇక మహేష్ బాబు సినిమా ఇప్పట్లో లేదు అంటూ ఇటీవల పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. వాటన్నిటికీ రాజమౌళి ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టేసాడు. సినిమా దాదాపు 80 శాతం పైగా పూర్తయిందని, త్వరలోనే మిగతా సినిమాను కూడా పూర్తి చేస్తాను అని ఆయన చెప్పడంతో సినిమా అనుకున్న టైం కి వస్తుంది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్.. అవనికి దొరికిపోతుందా..?

Related News

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

Big Stories

Advertisement
×