Dil Sequel: సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సీక్వెల్ సినిమాలో రావటం అనేది ఒక ట్రెండ్ అవుతుంది. ఒక సినిమా మంచి హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్.. లేదా ఫ్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల కాలంలో హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదండోయ్ గతంలో కూడా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో అభిమానులతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే తాజాగా దిల్ సినిమా(Dil Movie) సీక్వెల్ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. యంగ్ హీరో నితిన్(Nithin) హీరోగా నటించిన దిల్ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
సినిమా పేరుని ఇంటిపేరుగా..
వి.వి. వినాయక్(V.V. Vinayak) దర్శకత్వంలో నితిన్, నేహా బాంబ్ , ప్రకాష్ రాజు(Prakash Raj) వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2003 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా దిల్ రాజు నిర్మాతగా మారారు. అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆయన ఈ సినిమాతో నిర్మాతగా మారడమే కాకుండా మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఆయన పేరు పక్కన దిల్ సినిమా పేరును జోడించుకుని దిల్ రాజుగా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దిల్ రాజు కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.
దిల్ సీక్వెల్ ..
ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా తమ్ముడు(Thammudu) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితిన్ ప్రొడ్యూసర్ దిల్ రాజుని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దిల్ రాజు దిల్ సీక్వెల్(Dil Sequel) గురించి ప్రశ్నించారు. దిల్ సీక్వెల్ చేయొచ్చు కదా అంటూ నితిన్ ప్రశ్నించడంతో దిల్ రాజు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. దిల్ సినిమాలో హీరో హీరోయిన్లకు పెళ్లి కావడం వారికి కొడుకు పుట్టడంతో ఈ సినిమాని ముగించారు.
రీ ఎంట్రీ ఇచ్చిన లయ..
ఇక ఇప్పుడు దిల్ సినిమా కనుక చేస్తే తండ్రిగా కొడుకుగా నువ్వే నటించాల్సి ఉంటుంది అంటూ సమాధానం చెప్పారు. అవును కదా రెండు పాత్రలలో నేనే చేస్తే మంచి లీడ్ ఉంటుంది సినిమాకు అంటూ నితిన్ చెప్పడంతో ఒకవేళ చేస్తే ప్రకాష్ రాజ్ చివర్లో ఫోటో వైపు చూస్తూ ఉండిపోతారు కదా అలా చేయాల్సి ఉంటుంది అంటూ దిల్ రాజు సమాధానం ఇచ్చారు. దిల్ రాజు మాటలను బట్టి చూస్తే సీక్వెల్ చేయడం కుదరదని స్పష్టం అవుతుంది. ఇక తమ్ముడు సినిమాపై ఇటు దిల్ రాజు హీరో నితిన్ కూడా ఎన్నో అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా అక్క తమ్ముడు మధ్య కొనసాగే అనుబంధం గురించి తెలియజేయబోతుందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో హీరో నితిన్ అక్క పాత్రలో సీనియర్ నటి లయ నటించిన విషయం తెలిసిందే.
Also Read: Dil Raju -NTR: ఎన్టీఆర్ ను దిల్ రాజు అలా పిలుస్తారా.. అంత రిలేషన్ ఏంటీ?