BigTV English

OTT Movie : ఐలాండ్ లో ఒంటరిగా చిక్కుకుపోయే టీనేజ్ జంట… వీళ్ళు చేసే పనులకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : ఐలాండ్ లో ఒంటరిగా చిక్కుకుపోయే టీనేజ్ జంట… వీళ్ళు చేసే పనులకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : సముద్రంలో తప్పిపోయి, దీవిలో ఇరుక్కుపోయే స్టోరీలతో చాలా సినిమాలు తెరకెక్కాయి. కొన్ని అడ్వెంచర్లతో తెరకెక్కితే, మరికొన్ని లవ్ స్టోరీలతో వచ్చాయి . ఎలా వచ్చినా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక దీవిలో చిక్కుకుంటారు. ఆతరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన్ మూవీ పేరు ‘బ్లూ లగూన్ : ది అవే కింగ్’ (Blue Lagoon: The Awakening). 2012 లో వచ్చిన ఈ సినిమాకి మైకెల్ సాలోమన్, జేక్ న్యూసమ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇండియానా ఎవాన్స్ (ఎమ్మా), బ్రెంటన్ త్వైట్స్ (డీన్), డెనిస్ రిచర్డ్స్ (బార్బరా, ఎమ్మా తల్లి), పాట్రిక్ స్ట్. ఎస్ప్రిట్ (జాక్, డీన్ తండ్రి) నటించారు. ఇది 1908 లో రాసిన ‘The Blue Lagoon’ నవల ఆధారంగా రూపొందింది. ఇది కరీబియన్ దీవిలో చిక్కుకున్న ఇద్దరు టీనేజర్ల ప్రేమకథను చూపిస్తుంది. 1 గంట 25 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 5.4/10 రేటింగ్ ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఎమ్మా ఒక అందమైన హైస్కూల్ విద్యార్థిని, ఆమె తన స్కూల్ ట్రిప్‌లో ట్రినిడాడ్‌కు ఒక ఛారిటీ ప్రాజెక్ట్ కోసం వెళ్తుంది. ఆమెకు ఒక అబ్బాయిపై క్రష్ ఉంటుంది. మరో వైపు డీన్ అనే అబ్బాయి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ కోసం, ఎక్స్ట్రా క్రెడిట్ పొందేందుకు ఈ ట్రిప్‌లో చేరతాడు. అయితే  ఇక్కడ  ఎమ్మా, డీన్ వ్యక్తిత్వాలు విరుద్ధంగా ఉంటాయి. వీళ్ళు మొదట్లో ఒకరినొకరు ఇష్టపడరు. ట్రినిడాడ్‌లో ఒక పార్టీ సమయంలో, ఎమ్మా తన క్రష్‌తో ఒక పడవలో రహస్యంగా బయలుదేరుతుంది. కానీ డీన్ కూడా ఆమెను ఫాలో అవుతాడు. ఆ రాత్రి భారీ తుఫాను కారణంగా వారి పడవ పాడైపోతుంది. ఆమె క్రష్ తప్పించుకోగా, ఎమ్మా, డీన్ కరీబియన్‌లోని ఒక దీవిలో చిక్కుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్‌లు కూడా ఉండవు. ఈ దీవిలో బతకడం కోసం వీళ్ళు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి వస్తుంది. ఇక చేపలు పడుతూ వీళ్ళు ఆకలిని తీర్చుకుంటారు.

ఆ తరువాత వీళ్ళ వ్యతిరేక వ్యక్తిత్వాలు, ఒకరినొకరు ఇష్టపడేలా చేస్తాయి. వీళ్ళు అక్కడ కలిసి గడిపే సమయంలో ప్రేమలో కూడా పడతారు.వీళ్ళు దీవిలో ఉండగా, వారి స్కూల్‌మేట్స్, పేరెంట్స్ వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తూ, ప్రేమలో మునిగితేలుతుంటారు. కొన్ని రోజుల తరువాత ఒక ఊహించని ట్విస్ట్ తో వీళ్ళు విడిపోవలసి వస్తుంది. ఆతరువాత స్టోరీ టర్న్ తీసుకుంటుంది. చివరికి వీళ్ళు ద్వీపం నుంచి బయటపడతారా ? అందులోకే ఉండిపోతారా ? వీళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుందా ?  క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : బ్యాచిలర్స్ తో ఆడుకునే ఆడ దెయ్యం… ఈ మలయాళ కామెడీ కమ్ హర్రర్ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×