BigTV English

Dil Raju -NTR: ఎన్టీఆర్ ను దిల్ రాజు అలా పిలుస్తారా.. అంత రిలేషన్ ఏంటీ?

Dil Raju -NTR: ఎన్టీఆర్ ను దిల్ రాజు అలా పిలుస్తారా.. అంత రిలేషన్ ఏంటీ?

Dil Raju -NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్న దిల్ రాజు(Dil Raju) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన దిల్ రాజు ఇప్పటివరకు సుమారు 50కి పైగా సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో నిర్మాతగా తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. త్వరలోనే ఈయన నిర్మాణంలో నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక దిల్ రాజు నిర్మాతగా తన మొట్టమొదటి సినిమాను నితిన్ తో నటించిన విషయం తెలిసిందే.


ఎన్టీఆర్ మా నాన్న..

ఇక తిరిగి మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల దిల్ రాజు హీరో నితిన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నితిన్ దిల్ రాజును ఎన్నో ప్రశ్నలు వేస్తూ అతని నుంచి సమాధానాలను రాబట్టారు. నితిన్ కొంతమంది హీరో పేర్లు చెప్పగా వారి గురించి దిల్ రాజు అభిప్రాయం ఏంటో చెప్పమని చెప్పారు.
దీంతో ఎన్టీఆర్ (NTR)పేరు చెప్పగానే దిల్ రాజు మా నాన్న(Nanna) అంటూ సమాధానం ఇచ్చారు.


ఆ పిలుపు ముద్దుగా ఉంటుంది..

వెంటనే నితిన్ “నాన్న” ఎందుకలా? అంటూ మరో ప్రశ్న వేశారు. నేను తారక్ ను ఎక్కడ కనిపించినా నాన్న అనే పిలుస్తాను. తారక్ నన్ను అన్నా అని పిలుస్తారనీ ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ తో చాలా మంచి పరిచయం ఏర్పడిందని ఆ పరిచయంతోనే నేను బృందావనం సినిమా చేశానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు చాలా మంచి స్నేహితులు వారు కూడా ఎన్టీఆర్ ను ఎప్పుడు నాన్న అని పిలుస్తుంటారు. వాళ్లు అలా పిలవడం చాలా ముద్దుగా అనిపించింది అందుకే నేను కూడా అప్పటినుంచి ఎన్టీఆర్ ను నాన్న అని పిలవడం మొదలుపెట్టాను అంటూ దిల్ రాజు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ బిజీ..

ఇలా ఎన్టీఆర్ ను దిల్ రాజు గారు నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తారనే విషయం తెలిసిన తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అన్నయ్య నటుడు కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ను నాన్న అని పిలుస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయ్యి ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి డైరెక్టర్లతో ఎన్టీఆర్ సినిమాలు చేయబోతున్న విషయం తెలిసిందే.

Also Read: Kuberaa film: కుబేరకు షాకింగ్ రివ్యూ ఇచ్చిన చిరు… క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇచ్చారా?

Related News

Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!

Rishabh shetty: ఆ ఘర్షణ నుంచే కాంతార కథ పుట్టింది.. అసలు విషయం చెప్పిన రిషబ్!

Rajinikanth: మళ్లీ హిమాలయాలకు రజనీకాంత్.. కారణమేంటంటే!

Rukmini Vasanth Father: రుక్మిణి వసంత్ తండ్రికి అశోక చక్ర పురస్కారం.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Raashii Khanna: టాలీవుడ్ -బాలీవుడ్ కి అదే తేడా.. పని గంటలపై రచ్చ లేపిందిగా?

khushboo:కరూర్ ఘటన పక్కా ప్లానింగ్.. అనుమానాలు రేకెత్తించిన ఖుష్బూ!

Kantara: Chapter 1: థియేటర్ లోకి పంజుర్లి దేవుడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

Tollywood: పిక్ ఆఫ్ ది డే.. 80స్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. పైగా స్పెషల్ థీమ్!

Big Stories

×