BigTV English

India’s Longest Train: ఈ రైలు పొడవు 3.5 కి.మీలు.. ఎన్ని కోచ్ లు ఉంటాయో తెలుసా?

India’s Longest Train: ఈ రైలు పొడవు 3.5 కి.మీలు.. ఎన్ని కోచ్ లు ఉంటాయో తెలుసా?

Longest Indian Train: భారతీయ రైల్వే సంస్థ.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి దేశంలో అత్యంత పొడవైన రైలు. ఈ రైలు పేరు ‘సూపర్ వాసుకి’.  ఇందులో ఏకంగా 295 వ్యాగన్లు ఉన్నాయి. పొడవు 3.5 కిలో మీటర్లు ఉంటుంది. ఈ రైలుకు ఏకంగా 6 ఇంజిన్లు ఉంటాయి. ఈ రైలు వెళ్తుంటే వ్యాగన్లను లెక్కబెడితే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం.  గూడ్స్ రవాణాకు వినియోగించే ఈ రైలు రైల్వే క్రాసింగ్ దాటాలంటే చాలా సమయం పడుతుంది.


ఒకేసారి వేల టన్నుల బొగ్గు రవాణా

‘సూపర్ వాసుకి’ రైలును గూడ్స్ రవాణాకు వినియోగిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లోని గనుల నుంచి సేకరించిన బొగ్గును విద్యుత్ తయారీ కేంద్రాలకు తరలిస్తుంది. ఈ రైలు ఎక్కువగా చత్తీస్ గఢ్ లోని కోర్బా నుంచి మహారాష్ట్రలోని రాజ్‌ నంద్‌ గావ్‌ నడుమ బొగ్గును రవాణా చేస్తుంది. కోర్బా నుంచి రాజ్‌ నంద్‌ గావ్ కు చేరుకోవడానికి ఏకంగా 11.20 గంటలు పడుతుంది. ఒక్కో స్టేషన్‌ ను క్రాస్ చేయడానికి సుమారు 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ రైలు ప్రయాణిస్తుంటే పాములా కనిపిస్తుంది. అందుకే ఈ రైలుకు శివుని మెడలో ఉన్న వాసుకి పాము పేరు పెట్టారు.


దేశంలో ఇదే పొడవైన గూడ్స్ రైలు

భారతీయ రైల్వే సంస్థ ఇప్పటి వరకు నడిపించిన అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఇదేనని రైల్వేశాఖ వెల్లడించింది. రైలు ‘సూపర్ వాసుకి’ రైలు తీసుకొచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏకంగా ఒక రోజంతా నడుస్తుందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లను కలిగి ఉంటుంది. ఇది 9 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది. కానీ, సూపర్ వాసుకి 295 వ్యాగన్లు కలిగి ఉండి, ఒకేసారి 25,962 వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తుంది.

Read Also: వందే భారత్ రైలుకు తప్పిన భారీ ప్రమాదం.. పశువులను రక్షించబోయి కాపరి మృతి!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు

ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. దీని పేరు BHP ఐరన్ ఓర్ రైలు. ఏకంగా 7.3 కిలో మీటర్లు ఉంటుంది.  పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బారా ప్రాంతంలో నడుస్తున్న ఈ రైలుకు ఏకంగా 682 వ్యాగన్లు ఉంటాయి. దీనికి 8 ఇంజిన్లు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలుగా  గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రైలును ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నది. ఈ భారీ రైలు మౌంట్ న్యూమాన్ నుంచి పోర్ట్ హెడ్‌ ల్యాండ్ వరకు సుమారు 426 కిలో మీటర్ల పొడవున్న మార్గంలో నడుస్తుంది. రైలు 7 కిలో మీటర్లకు పైగా పొడవు ఉన్నప్పటికీ పట్టాలు తప్పకుండా ఇంజినీర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also:  రైలులో ఈ కాయ పట్టుకెళ్తున్నారా? జాగ్రత్త.. జైల్లో పెడతారు!

Related News

Bio Plastic Bags: ఇక ఆ రైల్వే జోన్ లో ప్లాస్టిక్ కనిపించదు, ఎందుకో తెలుసా?

Indian Railways Ticket: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Tirupati Special Trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Train Derailed: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Tirumala crowd: తిరుమలలో భక్తుల వెల్లువ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగానే.. టీటీడీ ప్రకటన ఇదే!

Confirmed Railway Ticket: కన్ఫార్మ్ టికెట్ పక్కా.. సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Big Stories

×