Navya Nair: ఇదెక్కడి విడ్డూరం అమ్మా.. మల్లెపూలు తీసుకెళ్తే జరిమానా వేస్తారా.. ? ఎక్కడ వినలేదు.. చూడలేదు అని నోర్లు వెళ్లబెట్టకండి. నిజమే కొన్ని దేశాల్లో అలాంటి రూల్స్ ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటి నవ్య నాయర్.. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఓనమ్ వేడుకకు హాజరయ్యింది. ఓనమ్ అంటే.. తెల్ల చీర, మల్లెపూలు ఉండాల్సిందే. అవి లేకపోతే అది అస్సలు పండగే కాదు. అందుకే నవ్య నాయర్.. ఇండియా నుంచే మల్లెపూలు పట్టుకెళ్లింది.
ఆస్ట్రేలియా మెల్ బోర్న్ ఎయిర్ పోర్ట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఎయిర్ పోర్ట్స్ లో ఒకటి. ఇక్కడ రూల్స్ పాటించకపోతే నిర్మొహమాటంగా జరిమానా విధిస్తారు. ఇక ఈ ఎయిర్ పోర్ట్ లో పళ్లు, పూలు తీసుకురావడం నిషేధం. ఎందుకంటే.. వాటి స్మెల్ వలన వేరేవారికి వ్యాధులు, ఎలర్జీలు వస్తాయని నమ్ముతారు. అందుకే అలాంటివాటిని తీసుకురానివ్వరు.
Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
కానీ, నవ్య నాయర్.. ఓనమ్ కోసం మల్లె పూలు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్లడంతో చెకింగ్ లో అవి బయటపడ్డాయి. దీంతో రూల్స్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కి కస్టమ్ అధికారులు అక్షరాలా రూ. 1.14 లక్షలు జరిమానా విధించారు. చేసేదేమి లేక నవ్య.. ఆ డబ్బు కట్టేసి ఈవెంట్ కు వెళ్ళింది. ఇక ఆ ఈవెంట్ లో నవ్య నాయర్ ఈ విషయాన్నీ బయటపెట్టింది. ఈ లెక్కన చూస్తే.. అమ్మడు పెట్టుకున్న మూరెడు మల్లెపూల ఖరీదు అక్షరాలా లక్షా 14 వేలు అన్నమాట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నవ్య నాయర్ గురించి చెప్పాలంటే.. తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో ఆమె ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. గతేడాది నుంచి ఇప్పటివరకు ఆమె ఎలాంటి సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆమె సూపర్ షో అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.