E-Paper
Advertisement

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Bethlehem kudumba unit movie OTT: వరుస చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న మమితా బైజు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సూర్యతో విశ్వనాథ్ అండ్ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె.. మలయాళ చిత్రంతో అంతే సక్సెస్ ను దక్కించుకుంది.. అదే బెత్లెహెం కుటుంబ యూనిట్. మమిత బైజు ప్రధాన పాత్రలో గిరీష్ ఏడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారుగా రూ.320 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బెత్లెహెం కుటుంబ యూనిట్..

ఇప్పటికే అక్కడక్కడ థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శనమవుతూనే ఉంది. అయితే అలా ఒకవైపు థియేటర్లలో ప్రదర్శించబడుతూనే.. మరొకవైపు డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుండడం గమనార్హం. కేరళలోనే కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ చిత్రంలో నివిన్ పౌలీ హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా నటించారు. అలాంటి ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటిటి ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

ఎటువంటి నాటకీయ మలుపులు లేకుండా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువత మనసులను హత్తుకునేలా భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుంది. సంగీత్ ప్రతాప్ , సురేష్, కృష్ణ , శ్రీంద, శ్యామ్ మోహన్ , వినయ్ ఫోర్ట్ తదితరులు సహాయక పాత్రలు పోషించారు. మొత్తానికి అయితే థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ చిత్రం.

బెత్లెహెం కుటుంబ యూనిట్ మూవీ స్టోరీ..

ఆశ్లే.. (మమిత బైజు) కాలేజ్ అమ్మాయి. తండ్రి తాగుడుకు బానిసవ్వడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె సొంత ఊరు వదిలి అంగమాలికి షిఫ్ట్ అవుతుంది. అక్కడే స్థానిక చర్చకి సంబంధించిన ఒక ప్రార్థన బృందం బెత్లెహెం కుటుంబ యూనిట్ ఆమెకు పరిచయం అవుతుంది. ఆశ్లే అద్దెకి దిగిన ఇంటి పక్కనే జస్టిన్ (నివిన్ పౌలీ) కూడా నివసిస్తూ ఉంటాడు. ఊళ్లో కేటరింగ్ బిజినెస్ చేసుకుంటూ అందరితో కలివిడిగా , మంచిగా ఉండే సాదాసీదా బ్యాచిలర్ అతడు. చదువుకునే రోజుల్లో ఎదురైనా ఒక బ్రేకప్ వల్ల పెళ్లి వద్దనుకుంటాడు.

Advertisement

also read: నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!

ఇక తనకి, ఆశ్లే కి మధ్య సుమారుగా 13 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది. కానీ అతని మంచితనం , పరిణతితో కూడిన వ్యక్తిత్వం, అభిరుచులు నచ్చి అతడి పై ఇష్టం పెంచుకుంటుంది ఆశ్లే. ఈ విషయం తెలిశాక జస్టిన్ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు.

కానీ ఒక అనుకోని సంఘటన వీళ్ళ రహస్య ప్రేమాయణాన్ని ఇంట్లో పెద్దలకు తెలిసేలా చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ ఏజ్ గ్యాప్.. ప్రేమ కథకు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన సవాళ్లు, సమస్యలు ఏంటి? వాళ్ళిద్దరూ వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఆఖరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Related News

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

Big Stories

Advertisement
×