E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ఇంట్రో సాంగ్ షూటింగ్, మొత్తానికి ఆ కొరియోగ్రాఫర్ కి బ్రేక్ వచ్చింది

Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ఇంట్రో సాంగ్ షూటింగ్, మొత్తానికి ఆ కొరియోగ్రాఫర్ కి బ్రేక్ వచ్చింది
Advertisement

Mana Shankara Vara Prasad Garu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందికి విపరీతమైన టాలెంట్ ఉన్నా కూడా అంత ఈజీగా అవకాశాలు రావు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్లు ప్రస్తావన వస్తే గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. అయితే చాలామంది ఆడియన్స్ కు ఆట సందీప్ కూడా పరిచయమే. అప్పట్లో వచ్చిన ఛాలెంజ్ అనే షో తో ఆట సందీప్ విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు. అసలు సందీప్ కి మంచి పేరు తీసుకొచ్చిన షో ఆట అప్పట్నుంచి ఆట సందీప్ అయిపోయాడు.

ఆ తర్వాత ఓంకార్ యాంకర్ గా చేసిన ఛాలెంజ్ షో తో ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. ఒక తరుణంలో ఆట సందీప్ హీరోగా చిన్నికృష్ణ కథతో సినిమా కూడా వస్తుంది అని అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ అవేవీ కుదరలేదు. మొత్తానికి రీసెంట్ టైమ్స్ లో ఆట సందీప్ కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సాధించుకుంటున్నాడు. ప్రదీప్ అద్వైత దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. ఈ సినిమాలో రీసెంట్ గా విడుదలైన సాంగ్ బాగా పాపులర్ అయింది ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఆట సందీప్.

మెగాస్టార్ తో ఛాన్స్ 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి కి సాంగ్ కొరియోగ్రఫీ చేయాలని ఆశ చాలా మందికి ఉంటుంది మొత్తానికి ఆ ఆశ ఆట సందీప్ కి కూడా నెరవేరుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఇంట్రో సాంగ్ కొరియోగ్రఫీ ఆట సందీప్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పాటకి సంబంధించిన షూటింగ్ రేపటి నుంచి అన్నపూర్ణ స్టూడియో 7 ఎకర్స్ లో మొదలుకానుంది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న కొరియోగ్రాఫర్లందరూ కూడా బిజీగా మారిపోయారు. ఈ తరుణంలో ఆట సందీప్ మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సాంగ్ ప్రూవ్ చేసుకుంటే వరుసగా అవకాశాలు రావడం ఖాయం. మరోవైపు ఇంట్రో సాంగ్ ఇస్తున్నారు. అంటే అది మామూలు విషయం కాదు. ఇంట్రో సాంగ్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

డాన్సులు ప్రత్యేకం 

Advertisement

అనిల్ రావిపూడి విషయానికి వస్తే ఒక హీరో ఏమి చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో అనే క్లారిటీ కంప్లీట్ గా అనిల్ కు ఉంది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద అనిల్ చేసిన అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. అటువంటి అనిల్ రావిపూడి కి మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో దొరికాడు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని రకాలుగా మెగాస్టార్ ని చూపించొచ్చు అన్ని ప్రయత్నాలు చేసుంటాడు అని చెప్పొచ్చు.

అయితే మెగాస్టార్ చిరంజీవి నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది డాన్సులు. అవి కూడా అనిల్ రావిపూడి కరెక్ట్ గా ప్లాన్ చేశాడు అని సమాచారం వినిపిస్తుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి పాత పాటల్లో ఒక పాట కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Also Read: Champion : పాతిక సంవత్సరాలు తర్వాత ఆ నందమూరి వారసుడు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×