E-Paper
Advertisement

IND Vs USA : పసికూన చేతిలో టీమిండియా చిత్తు… USA టార్గెట్ ఎంతంటే..?

IND Vs USA : పసికూన చేతిలో టీమిండియా చిత్తు… USA టార్గెట్ ఎంతంటే..?
Advertisement

IND Vs USA : టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో భాగంగా టీమిండియా వ‌ర్సెస్ యూఎస్ఏతో మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన యూఎస్ఏ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫ‌స్ట్ భార‌త్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 161 ప‌రుగులు చేసింది. తొలుత భార‌త్ కాస్త త‌డ‌బ‌డింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కావ‌డం గ‌మనార్హం. ఇషాన్ కిష‌న్ (20), తిల‌క్ వ‌ర్మ (25), శివ‌మ్ దూబే డ‌కౌట్ అయ్యారు. రింకూ సింగ్ (06), హార్దిక్ పాండ్యా(5) ప‌రుగులు చేశారు. అక్ష‌ర్ ప‌టేల్ 14 ప‌రుగులు చేసి వెను దిరిగాడు. ఓవైపు భార‌త ఆట‌గాళ్లంద‌రూ క్యూ క‌డుతున్న‌ప్ప‌టికీ సూర్య కుమార్ యాద‌వ్ త‌న హాప్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. సూర్య‌కుమార్ చెల‌రేగిపోయాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదుర‌గొట్టాడు. వాంఖ‌డే స్టేడియంలో సూర్యుడు ఉద‌యించాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : IND VS USA: ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే..300 కొట్ట‌డం ప‌క్కా, బుమ్రా, సంజు దూరం

సూర్య‌కుమార్ యాద‌వ్ విధ్వంసం..

Advertisement

చివ‌రి ఓవ‌ర్ లో అయితే రెచ్చిపోయాడు సూర్య‌కుమార్ యాద‌వ్. 4, 6, 6, 4, 0, 1 ప‌రుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ (ICC Men’s T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అమెరికాతో జరుగుతున్న‌ తొలి మ్యాచ్‌లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. చివరి వ‌ర‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశారు. 20 ఓవర్లలో 161-9 స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్య(84) రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. USA బౌలర్లలో స్కాల్క్విక్ 4, హర్మీత్ 2 వికెట్లు తీయగా అలీ ఖాన్, మొహమ్మద్ మోహ్సిన్ తలో వికెట్ పడగొట్టారు. అమెరికా విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో టీమిండియా చాలా సులువుగా విజ‌యం సాధిస్తుంద‌ని మ్యాచ్ కి ముందు అంతా ఊహించారు. కానీ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కావ‌డంతో టీమిండియా అభిమానులంద‌రూ ఒక్క‌సారిగా జీర్ణించుకోలేక‌పోతున్నారు. తొలుత టీమిండియా స్కోర్ క‌నీసం 100 ప‌రుగులు అయినా సాధిస్తుందా..? అని భావించారు. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్ మెల్ల‌గా రాణించి చివ‌ర్లో ప‌రుగుల‌ను రాబ‌ట్టాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ టీమిండియా చాలా ఉప‌యోగ‌ప‌డింది. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ తొలి మ్యాచ్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి అభిమానుల మ‌న‌స్సును దోచుకున్నాడు. నిన్న వైభ‌వ్ సూర్య‌వంశీ, ఇవాళ సూర్య‌కుమార్ యాద‌వ్.. సూర్య పేరు ఉన్న వాళ్లు అంద‌రూ అద్భుతంగా రాణిస్తార‌ని అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో 20 ఓవ‌ర్ల‌లో 161-9 స్కోర్ చేసింది టీమిండియా. టీమిండియా బౌల‌ర్లు రాణిస్తే.. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధిస్తుంది. ముఖ్యంగా యూఎస్ఏ బౌల‌ర్లు, ఫీల్డ‌ర్లు అద్భుతంగా రాణించారు. టీమిండియా జ‌ట్టుకే చుక్క‌లు చూపించారంటే.. ఫీల్డింగ్ ఏవిధంగా చేశారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement

Also Read : Pakistan vs Netherlands: టీ20 ప్రపంచ కప్ లో మూడు చెరువుల నీళ్లు తాగించిన ప‌సికూన‌..కానీ చివ‌ర‌కు పాకిస్తాన్ దే విజ‌యం

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×