E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Manchu Lakshmi: ఈ మధ్య కాలంలో  సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్స్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక రేంజ్ క్రేజ్ దక్కుతోంది. ఈ క్రమంలోనే సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సరికొత్త ప్లాన్‌లు వేస్తున్నాయి టాప్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్. ఈ క్రమంలోనే  ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జులై 3వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రేజీ రియాలిటీ షోకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటి, హోస్ట్ మంచు లక్ష్మి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళల దుస్తుల ఎంపికపై ఆమె చాలా బోల్డ్‌గా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో మరియు బయట మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌పై పలు రకాల వివాదాలు, ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

కంఫర్టబుల్‌ డ్రెస్సులే వేసుకోవాలన్న లక్ష్మి 

Advertisement

వీటిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. మహిళలు తమకు నచ్చిన, తాము కంఫర్టబుల్‌గా ఫీలయ్యే డ్రెస్సులే వేసుకోవాలని గట్టిగా చెప్పారు. సమాజంలో ఎవరికో నచ్చాలని, ఎవరో ఏదో అనుకుంటారని దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. డ్రెస్సింగ్ విషయంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని, వారి కంఫర్ట్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్న మాటలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

also read :‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

ఈ ఈవెంట్‌లో కేవలం డ్రెస్సింగ్ వివాదం మాత్రమే కాదు, మరో ఆసక్తికరమైన సీన్ కూడా చోటుచేసుకుంది. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ జోడీగా పేరొందిన సుధీర్-రష్మి లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ‘జబర్దస్త్’ వంటి పాపులర్ కామెడీ షోలతో పాటు ఈ ఇద్దరూ కలిసి చేసిన స్క్రీన్ మ్యాజిక్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న యాంకర్ రష్మి గౌతమ్‌ను ఉద్దేశించి ఒక జర్నలిస్ట్.. సుధీర్ గురించి మాట్లాడాల్సిందిగా కోరారు.

ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో

దీనిపై రష్మి స్పందించేలోపే పక్కనే ఉన్న మంచు లక్ష్మి వెంటనే కల్పించుకున్నారు. మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదంటూ సదరు జర్నలిస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం సైలెంట్ అయిపోయింది.

also read :సుధీర్‌తో సినిమా‌ వార్తలపై స్పందించిన రష్మి.. అంత మాట అనేసిందేంటీ?

మంచు లక్ష్మి గతంలో ‘లక్ష్మి బాంబ్’, ‘దొంగాట’ వంటి చిత్రాలతో పాటు పలు టాక్ షోలతో అలరించగా, ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అటు రష్మి కూడా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ వంటి సినిమాలతో పాటు వరుస ఈవెంట్స్, రియాలిటీ షోలతో బిజీగా దూసుకుపోతోంది. ఇలాంటి ఇద్దరు క్రేజీ లేడీస్ ఒకే వేదికపై కనిపించడమే కాకుండా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో జులై 3న రాబోతున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటు డిజిటల్ క్రియేటర్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఈ షో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో నని  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

పెద్ద సినిమాల్లో బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !

సుధీర్‌తో సినిమా‌ వార్తలపై స్పందించిన రష్మి.. అంత మాట అనేసిందేంటీ?

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

‘రాజా సాబ్’ దెబ్బకి డార్లింగ్ రూట్ మార్చాడా? 2027లో ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర..

బాక్సాఫీస్ ‘పెద్ది’ అరాచకం.. 400 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్.. నేడే మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్!

నారా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నారా వారి కోడలు..

పవన్ కళ్యాణ్ ‘OG 2’ గురించి అర్జున్ దాస్ షాకింగ్ కామెంట్స్..!

Big Stories

×