Mutton Curry Incident: హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ కాలనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడంతో అస్వస్థతకు గురయ్యారు. మరో ఏడుగురు చింతలకుంటలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాణం తీసిని మాంసం..
వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలోని.. శ్రీనివాస్ ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే బోనాల పండగ సందర్భంగా ఆదివారం రోజున శ్రీనివాస్ బావ కుటుంబాన్ని ఇంటికి పిలిచి విందుభోజనం ఏర్పాటు చేశాడు. ఈ విందుభోజనం చక్కగా అందరు కలిసి ఎంతో సంతోషంగా ఆరగించారు. అయితే ఆదివారం రోజు చికెన్, బోటి కూర రెండూ కూడా మధ్యాహ్నం, నైట్ రెండు పూటల తిన్నారు. ఆ రాత్రి నుంచే కుటంబంలో ఫుడ్ పాయిజన్ కావడం మొదలైంది. మరుసుటి రోజూ కుటంబంలోని వారందరికి కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆసుపత్రి పాలయ్యారు.
సీరియస్‌గా పాప ఆరోగ్యం..
ఈ ఘటనలో ఇప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తి మృతిచెందగా.. ఆయన ఇద్దరు కూమార్తెలు ICU లో చికిత్స పొందుతున్నారు. అలాగే శ్రీనివాస్ భార్యకు కూడా సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నాం అని ఆనందించే లోపే.. తీవ్ర విషాదాన్ని నింపింది. పండుగ రోజూ అందరు కలిసి సంతోషంగా ఇంట్లో ఉండాల్సిన సమయంలో ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.
Also Read: చేశారా? చేయించారా? ధన్‌ఖడ్ రాజీనామా ఎన్నో అనుమానాలు.!
ఘటనపై స్పందించిన మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కూమార్
అబ్దుల్లాపూర్ మెట్టు ఫిలిమిరీ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కూమార్ సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలు పూర్తిగా తీసుకుని ఒక రిపోర్ట్‌ని తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తానిని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే 12 మంది ఆసుపత్రి పాలయినట్లు సమాచారం ఇచ్చారు. ఎవరైన సరే చికెన్ షాప్‌లో కానీ.. మటన్ షాప్‌లో గానీ మాంసం కొనేటప్పుడు అక్కడ క్లీన్‌గా ఉందా లేదా అని పరిశీలించాలి. అలాగే మాంసాని ప్రేష్‌గా ఇస్తున్నాడా లేదా చూసుకోవాలి. అంతేకాకుండా రోడ్‌సైడ్ మాంసం అమ్మేవారి దగ్గర అస్సలు కొనకూడదని హెచ్చరిస్తున్నారు.