Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఏ. ఎం.రత్నం (AM Ratnam) శ్రీ మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజకీయ చిచ్చు రేపిన పవన్ కళ్యాణ్, RRR
ఈ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడుకుండా కాస్త రాజకీయ రచ్చ లేపారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(RRR )..” ఆంధ్రప్రదేశ్లో ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించడంలో పవన్ కళ్యాణ్ ప్రథమ పాత్ర పోషించారు”అని కామెంట్లు చేయగా.. అటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” భీమ్లా నాయక్ సినిమాకు పది రూపాయలు టికెట్ పెట్టినా నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది. మన దగ్గర రౌడీలు , ఆయుధాలు లేవు. నిజమే గెలుస్తుంది. న్యాయమే నిలబడుతుంది” అంటూ వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan Mohan Reddy) ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
#BoycottHHVM పై పవన్ కళ్యాణ్ రియాక్షన్..
ఇక దీంతో మండిపడ్డ వైసీపీ అభిమానులు #BoycottHHVM అంటూ సినిమాను బాయ్కాట్ చేయాలి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీనికి తోడు మహేష్ బాబు (Maheshbabu ), జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు కూడా ఈ సినిమాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో ఆయన ఒక్క మాటతో అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు.
ఇలాంటి బాయ్ కాట్ లు నా సినిమాను ఏం చేయలేవు – పవన్ కళ్యాణ్
తాజాగా పలు టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈ బాయ్కాట్ ట్రెండింగ్ పై మాట్లాడుతూ.. “హరిహర వీరమల్లు సినిమాని బాయ్ కాట్ చేయాలా? దేనికంట.. అంటే బాయ్కాట్ దేనికి చేయాలి అని.. అయినా ఈ బాయ్ కాట్ లు అనేవి ఇకపై నడవవులెండి. అది వేరే విషయం. సినిమాని గన్ షాట్ లో పెట్టి ఎవరు చూపించరు. ఇష్టపడి టికెట్టు కొనుక్కొని మరీ వెళ్తారు. నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోవాలి అనేది పూర్తిగా నా చాయిస్ మాత్రమే. నేను చిన్నప్పుడు ఏదైనా సినిమాకి వెళ్లాలంటే రామారావు సినిమాలకు లేదా వేరే ఎవరి సినిమాకు అయిన టికెట్లు దొరక్కపోతే మా కజిన్స్ బ్లాక్లో టికెట్ కొనిస్తే.. వెళ్లేవాళ్లు. ఎందుకంటే ఇది మన ఛాయిస్. అలాంటి దాన్ని బాయ్ కాట్ చేయమని ఎవరైనా చెప్పినా చేయరు. నచ్చకపోతే సినిమా చూడకపోవడం వేరు.. కానీ ఇలాంటివి ఇకపై నడవవు. ఏదైనా మేం పనులు చేసేటప్పుడు ప్రత్యర్ధులు లేకుండా ఎందుకు ఉంటారు. అలాంటివి చేయకూడదని అనుకోవడం మన అవివేకం. కాబట్టి ఎవరికి ఏం కావాలో అది చేసుకోనివ్వండి.. సంతోషం అయినా ఇలాంటి బాయ్ కాట్ లతో ఏం పీ*లేరు “అంటూ కాస్త గట్టిగానే సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్.
also read:HHVM First Review: వీరమల్లుపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన నా అన్వేషణ.. హైలెట్ పవన్ మాత్రం కాదంటూ!