BigTV English

Lalit Modi : శ్రీశాంత్ భార్యపై లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకేంటి నొప్పి అంటూ

Lalit Modi : శ్రీశాంత్ భార్యపై లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకేంటి నొప్పి అంటూ

Lalit Modi :  తొలి ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ శ్రీశాంత్(Sreesanth) ను ముంబై ఇండియన్స్ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)  చెంప దెబ్బ కొట్టిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 18 ఏళ్ల తరువాత ఇందుకు సంబంధించిన వీడియో ను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ (Lalit Modi)  ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి స్పందించి లలిత్ మోడీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు అస్సలు సిగ్గు ఉందా..? మీకు అస్సలు మానవత్వం ఉందా..? అంటూ మండిపడ్డారు. తాజాగా లలిత్ మోడీ స్పందించారు.


Also Read : Rajasthan Royals : రాజస్థాన్ జట్టులో ముసలం…ద్రవిడ్ తో పాటు సంజూ, జైస్వాల్ ఔట్?

శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైర్ అవుతున్నారు : లలిత్ మోడీ 


” అసలు శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైర్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏం జరిగిందనే వాస్తవాన్ని మాత్రమే షేర్ చేశా. శ్రీశాంత్ బాధితుడు. నేను సరిగ్గా అదే చెప్పాను. గతంలో నన్ను ఎవ్వరూ ఈ ప్రశ్న అడగలేదు. క్లార్క్ అడిగితేనే స్పందించాను” అని తెలిపారు లలిత్ మోడీ. సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి పోస్ట్ చేశారు. “లలిత్ మోడీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన ఈ పనికి సిగ్గు పడండి. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్ గా ప్రవర్తించారు. దీని కారణంగా మీరు కేవలం ఇద్దరూ వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్టు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ సంఘటన గురించి మరిచిపోయారు.

మానవత్వం మచ్చుకైనా ఉందా..? 

అయితే  వారికి స్కూల్స్ కి వెళ్లే వయస్సు పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ ఇదేం పద్దతి.. మీకు అస్సలు హృదయం ఉందా..? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా..? శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్ ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనస్సు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా..? ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుక..? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా..? చిన్నారి పిల్లల మనస్సులపై గతం తాలుకూ మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా..? మీకు కాస్త అయినా సిగ్గుందా..? చేయని తప్పులకు వారు శిక్ష అనువించాలా..? అని ప్రశ్నించారు. ఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులను చేసినందుకు మీపై పరువు నష్టం దావా వేయాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు భువనేవ్వరి కుమారి. ప్రస్తుతం వీరి వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

IPL 2026 : IPL 2026 కంటే ముందే పెను మార్పులు…ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

Rajasthan Royals : రాజస్థాన్ జట్టులో ముసలం…ద్రవిడ్ తో పాటు సంజూ, జైస్వాల్ ఔట్?

Namibia vs Scotland : మ్యాచ్ జరుగుతుండగా కలకలం… ఒక్కసారిగా గ్రౌండ్ లో మంటలు.. అసలు ఏం జరిగిందంటే

Salman Nizar – KCL : 6, 6, 6, 6, 6, 1, 6, 6, 6, 6, 6, 6… 12 బంతుల్లో 11 సిక్సర్లు..వీడియో చూస్తే

Big Stories

×