BigTV English

OTT Movie : కళ్ళముందే కంటికి కన్పించని శక్తి… చూస్తే డైరెక్ట్ నరకానికి టికెట్… ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉండే మూవీ

OTT Movie : కళ్ళముందే కంటికి కన్పించని శక్తి… చూస్తే డైరెక్ట్ నరకానికి టికెట్… ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉండే మూవీ
Advertisement

OTT Movie : కొన్ని హాలీవుడ్ సినిమాలు చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే చెప్పడం కష్టమే. ఆ సినిమాల క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, మూవీ పేరు, ఓటీటీ డీటైల్స్ గురించి తెలుసుకోవడానికి చూపించే ఆత్రం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ వైరల్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఓటీటీ, పేరు వంటి వివరాలు తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘బర్డ్ బాక్స్’ (Bird Box). 2018లో విడుదలైన గ్రిప్పింగ్ అమెరికన్ పోస్ట్-అపోకలిప్టిక్ హారర్-థ్రిల్లర్. ఒక మహిళ తనతో పాటు ఇద్దరు పిల్లల కళ్ళకు గంతలు కట్టి, కంటికి కన్పించని శక్తి నుండి తప్పించుకోవడానికి ప్రమాదకరమైన ప్రయాణం చేసే కథ ఇది. ఈ శక్తిని ఎవరైనా చూస్తే, అది వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. సుసానే బియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జోష్ మలెర్మాన్ నవల ఆధారంగా తెరకెక్కించారు. బర్డ్ బాక్స్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా. 2018 డిసెంబర్ 13న లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో సాండ్రా బుల్లక్ (మలోరీ), ట్రెవాంటే రోడ్స్ (టామ్), జాన్ మల్కోవిచ్ (డగ్లస్), సారా పాల్సన్ (జెస్సికా), జాకీ వీవర్ (షెరిల్), రోసా సలాజర్ (లూసీ), డానియల్ మాక్‌డోనాల్డ్ (ఒలింపియా), లిల్ రెల్ హౌరీ (చార్లీ), టామ్ హాలండర్ (గ్యారీ), వివియన్ లైరా బ్లెయిర్, జూలియన్ ఎడ్వర్డ్స్ (మలోరీ పిల్లలు, గర్ల్ మరియు బాయ్) నటించారు. ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…
ఈ మూవీ స్టోరీ ప్రస్తుతం, ఐదు సంవత్సరాల క్రితం ఇలా రెండు టైమ్‌లైన్‌లలో జరుగుతుంది. మలోరీ (సాండ్రా బుల్లక్) అనే ఒంటరి తల్లి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత టైమ్‌లైన్‌లో మలోరీ తన ఇద్దరు చిన్న పిల్లలు గర్ల్ (వివియన్ లైరా బ్లెయిర్), బాయ్ (జూలియన్ ఎడ్వర్డ్స్ తో కలిసి, కళ్ళకు గంతలు కట్టుకొని, ఒక నది ఒడ్డున ఒక ప్రమాదకరమైన ప్రయాణంలో ఒక సేఫ్ ప్లేస్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రపంచంలో ఒక రహస్యమైన అతీంద్రియ శక్తి మనుషుల్ని చంపుతుంది. దానిని చూసినవారు వెంటనే భయంకరమైన భ్రాంతులకు లోనై, ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే మలోరీ, పిల్లలు ఎప్పుడూ కళ్ళకు గంతలు కట్టుకునే ఉంటారు, ఇది వారి ప్రయాణాన్ని మరింత టెన్స్‌గా మారుస్తుంది.


ఐదు సంవత్సరాల క్రితం ఫ్లాష్‌బ్యాక్‌లలో, మలోరీ గర్భిణీ స్త్రీ. ఈ అపోకలిప్స్ ప్రారంభమైనప్పుడు, తన సోదరి జెస్సికా (సారా పాల్సన్)తో కలిసి ఒక సేఫ్ హౌస్‌లో ఆశ్రయం పొందుతుంది. ఈ సేఫ్ హౌస్‌లో డగ్లస్ (జాన్ మల్కోవిచ్), ఒలింపియా (డానియల్ మాక్‌డోనాల్డ్), టామ్ (ట్రెవాంటే రోడ్స్), చార్లీ (లిల్ రెల్ హౌరీ), లూసీ (రోసా సలాజర్) వంటి ఇతర సర్వైవర్‌లు ఉంటారు, వీరంతా కలిసి ఈ శక్తి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

Read Also : మనుషుల్ని తినే తెగ, వీళ్ళ చేతికి చిక్కితే విందే… తెగను కాపాడడానికి వెళ్లి వాళ్ళకే బలి

గ్యారీ (టామ్ హాలండర్) అనే ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, అతను గ్రూప్‌కు అనూహ్యమైన ముప్పును తీసుకొస్తాడు. మలోరీ ఒక రిజర్వ్‌డ్, స్వతంత్ర స్వభావం కలిగిన స్త్రీ, తన గర్భంలోని బిడ్డ కోసం, ఆ తర్వాత తన పిల్లల కోసం సర్వైవ్ అవ్వడానికి పోరాడుతుంది. ఐదేళ్ల క్రితం ఆ గ్యాంగ్ లో అసలేం జరిగింది? ఇప్పుడు తన పిల్లలతో హీరోయిన్ ఎలా సర్వైవ్ అయ్యింది? అసలు ఆ అదృశ్య శక్తి ఏంటి? అన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×