E-Paper
Advertisement

BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!

BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!
Advertisement

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.30 ఏండ్లు కమ్యూనిస్టు పాలన, పదిహేను ఏండ్లు టీఎంసీ పాలనలో ఉన్న బెంగాల్‌లో కాషాయపార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీదీ కంచుకోటగా బెంగాల్‌ను అభివర్ణించేవారు. గత ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుందని భావించినా.. టీఎంసీ బీజేపీకి చాన్స్ ఇవ్వలేదు.ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం,ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ ఓట్ల ఏరివేత, కేంద్ర బలగాలను మోహరించి.. రిగ్గింగ్, దొంగఓట్లను నివారించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమైంది. అయితే, బెంగాల్ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో పవర్‌లోకి రావడం పెద్ద కష్టమేమి కాదని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ రాక అందుకేనా?

2028 చివరలో తెలంగాణకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఒకవేళ జమిలితో వెళితే 2029లో అనగా తెలంగాణ అసెంబ్లీ ముగిసిన ఆరు నెలల తర్వాత పార్లమెంట్‌తో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. దీనికి తోడు నియోజకవర్గాల పునర్విభజన అంశం తేలాల్సి ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన జరుగుతోంది. ఈ లెక్క తేలాక మహిళ రిజర్వేషన్ చట్టంతో పాటు డీలిమిటేషన్ సైతం చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తున్నది. జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకు మైలేజ్ ఉంటుందని నిపుణుల అంచనా. అందుకే కేంద్రం తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ ప్రధాని మోడీ రానున్నారు. ఇక్కడ రూ.8వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

స్థానికనేతలకు దిశానిర్దేశం..

Advertisement

మోడీ ఇవాళ రాష్ట్ర పర్యటన తర్వాత స్థానిక నేతలతో ముచ్చటిస్తారని తెలుస్తోంది. గతంలోనే రాష్ట్ర ఎంపీలకు క్లాస్ పీకిన ఆయన..ఈసారి వారికి మరోసారి దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎలాగైనా ముందుకు వెళ్లాలని.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని సంకేతం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రానికి అమిత్ షా వస్తారని.. తెలుస్తుండా.. అంతకుముందే బీజేపీ జాతీయ ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్‌లు రాష్ట్రానికి వచ్చి పార్టీ నేతల మధ్య గల అంతరాలు, క్షేత్రస్థాయిలో పార్టీకి గల ప్రజల మద్దతు, ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు చేయడం లేదని ఓ నివేదిక తయారు చేసి కేంద్రానికి అందజేయనున్నారని సమాచారం.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష!

Advertisement

ఆ తర్వాతే అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ఆయన వచ్చాకే రాష్ట్ర బీజేపీలో సమూల మార్పులు జరుగుతాయని.. వచ్చే రెండేండ్లలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో కేడర్ బలోపేతం, మోడీ అందిస్తున్న పథకాలు, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధులు కేటాయింపులు, ఆరోగ్యం, విద్య కోసం కేంద్రప్రభుత్వ స్కీమ్స్ అన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేస్తారని టాక్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి గట్టిగా ఎన్నికల ముందు రెండు నెలలు కష్టపడితే చాలని కొందరు సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.గత ఎన్నికల్లో బీజేపీ కొన్ని చోట్ల రెండో స్థానం, మరికొన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితమైందని, ఇంకాస్త కష్టపడితే తొలిస్థానానికి వస్తుందని పేర్కొంటున్నారు.

 

Related News

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

Big Stories

Advertisement
×