E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
Advertisement

Moto Pad 70 Groove: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత్‌లో తమ సరికొత్త ట్యాబ్లెట్ Moto Pad 70 Grooveను అధికారికంగా విడుదల చేసింది. వినోదానికి, నిరంతర వినియోగానికి ప్రాధాన్యమిచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ట్యాబ్‌ను డిజైన్ చేసింది. భారీ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన ఆడియో సిస్టమ్‌తో ఈ పరికరం మార్కెట్లోకి వచ్చింది.

ఈ Moto Pad 70 Groove ట్యాబ్లెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఒకే ఒక్క వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.36,999 కాగా, నిర్దిష్ట బ్యాంక్ కార్డులపై రూ.4,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.32,999కే ఈ ట్యాబ్లెట్‌ను సొంతం చేసుకోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ‘పాంటోన్ బ్లూ సర్ఫ్’ కలర్‌లో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: తిరుగులేని బ్యాటరీతో Poco M8 Power 5G.. రూ.3,000 డిస్కౌంట్‌తో ఎలా కొనాలంటే?

Moto Pad 70 Grooveలో 12.1 అంగుళాల పెద్ద 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌లకు సపోర్ట్ చేస్తుంది. కంటికి అలసట కలగకుండా ప్రత్యేక సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఇక దీని ప్రధాన ఆకర్షణ దీని ఆడియో వ్యవస్థే. 9 జేబీఎల్ ప్రో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ట్యాబ్లెట్‌లో సినిమాలు చూడటం, పాటలు వినడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

Advertisement

ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్‌ను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. అవసరమైతే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. దీనిలోని 10200mAh భారీ బ్యాటరీ రోజంతా నిరంతరంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. అలాగే ఇది వేగవంతమైన ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా, డాక్యుమెంట్ స్కానింగ్ కోసం 13MP రేర్ కెమెరా ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్ 5.4, టైప్-సి పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ52 రేటింగ్ కూడా అందిస్తున్నారు. చదువుకునే విద్యార్థులకు, ఆఫీస్ పనులు చేసుకునే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి Moto Pad 70 Groove బెస్ట్ ఆప్షన్.

Also Read: iPhone 20 సిరీస్ చూడటానికి ఇలా ఉండబోతోందా? లుక్ మొత్తం మార్చేస్తున్న యాపిల్!

Tags

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

Big Stories

Advertisement
×